‘నాగబంధం’.. విజువల్‌గా మెస్మరైజ్‌ చేస్తుంది

ABN , Publish Date - Jun 17 , 2026 | 07:09 AM

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న ‘నాగబంధం’ చిత్రంలో అనంత పద్మనాభస్వామి ఆలయం స్ఫూర్తితో రూపొందించిన భారీ సెట్స్‌, సహజమైన విజువల్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని డీవోపీ ఎస్‌.సౌందర రాజన్‌ వెల్లడించారు.

Nagabandham

విరాట్‌ కర్ణ (Virat Karna) హీరోగా అభిషేక్‌ నామా (Abhishek Nama) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఎపిక్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ ‘నాగబంధం’ (Nagabandham) జూలై 3వ తేదీన విడుదల కానుంది. కిశోర్‌ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీగా పని చేసిన ఎస్‌.సౌందర రాజన్‌ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘నేను ఇంతకుముందు అభిషేక్‌ గారితో ‘డెవిల్‌’ సినిమా చేశాను. ఆయన పెద్ద విజన్‌తో ‘నాగబంధం’ ప్రాజెక్ట్‌ ప్రారంభించారు. స్క్రిప్ట్‌ స్టేజ్‌ నుంచే అందులో నేను ఇన్‌వాల్వ్‌ అయ్యాను. దీన్ని విజువల్‌గా ఎంత గ్రాండ్‌గా చూపించాలో ప్లాన్‌ చేశాం. సినిమాలో ప్రతి సన్నివేశానికి తగ్గట్లుగా సహజమైన లైటింగ్‌తో కథలో లీనమయ్యేలా తీశాను. సినిమాలోని విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా చాలా సహజంగా, రియల్‌గా ఉంటాయి’ అని చెప్పారు.

చిత్రం ప్రారంభించే ముందు దర్శకుడు, కళాదర్శకుడితో కలసి ఎన్నో దేవాలయాలు తిరిగామని చెబుతూ ‘తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్లాం. అక్కడ ప్రతి అంశాన్ని డిటెయిల్డ్‌గా ఫొటోలు తీశాం. అదే ఆలయం ఆధారంగా కథ తయారు చేసుకున్నప్పటికీ సినిమాలో ఆలయం పేరును ‘శ్రీరంగపురం’ అని పెట్టాం. ఆర్ట్‌ డైరెక్టర్‌ అశోక్‌ అద్భుతమైన సెట్స్‌ వేశారు. నేను ఇంతవరకూ చాలా పెద్ద సినిమాలు చేశాను కానీ ఇంత భారీ స్ఠాయిలో సెట్స్‌ ఉన్న చిత్రం చేయలేదు. అంత పెద్ద సెట్స్‌ను లైటింగ్‌ చేయడం, హై స్పీడ్‌లో షూట్‌ చేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది’ అని సౌందరరాజన్‌ చెప్పారు.

Nagabandham.jfif

సినిమాలో హైలైట్స్‌ గురించి చెబుతూ.. ‘ అనంత పద్మనాభస్వామి టెంపుల్ (Anantha Padmanabha Swamy Temple), అక్కడ జరిగే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. పతాక సన్నివేశాలు ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేస్తాయి. ఈ సినిమాలో భారీ విగ్రహం రూపొందించాం. అందుకు సంబంధించిన వర్క్‌లో దేశంలోని ప్రముఖ నిపుణులు పాల్గొన్నారు. దర్శకుడు అభిషేక్‌ నామా అద్భుతమైన కథ రాసుకున్నారు. ఆ ఆలోచన మా అందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆయన విజన్‌కు తగ్గట్లు నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఖర్చు పెట్టారు. మా నిర్మాతలకు సినిమా అంటే ఉన్న ప్యాషన్‌ కారణంగా ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేలా ‘నాగబంధం’ చిత్రాన్ని నిర్మించారు’ అని తెలిపారు.

Updated Date - Jun 17 , 2026 | 07:09 AM