మీ శీలం కన్నా.. నా శీలం మెరుగు: కంగనా సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 21 , 2026 | 02:09 PM
ఇటీవల బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు.
బీజేపీ ఎంపీ (BJP MP), బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut)మరోసారి తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఇటీవల యోగా గురు బాబా రాందేవ్ (Baba Ramdev) చేసిన వ్యాఖ్యలపై ఆమె సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు గుప్పించారు. “నా వ్యక్తిగత జీవితం, పడకింటి వ్యవహారాల గురించి ఊహాగానాలు చేయొద్దని, కలలు కనొద్దని, నాకు శీల పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. నా శీలం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని అయినా నా గురించి మాట్లాడే వారి శీలం కన్నా నా శీలం చాలా మెరుగు” అంటూ ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడూ తప్పుడు వ్యాపార ప్రకటనలు ఇచ్చి న్యాయస్థానాల నుంచి మందలింపులు ఎప్పుడు ఎదుర్కోలేదని కూడా పేర్కొన్నారు.
అయితే.. కాక్రోచ్ జనతా పార్టీ నేతలను గట్టర్ జనరేషన్‌గా అభివర్జిస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన రాందేవ్ బాబా ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొందరు రాజకీయ నాయకులు యువత గురించి గట్టర్ అంటూ అవమానకరంగా మాట్లాడటం సరైంది కాదని, అలాంటి వ్యాఖ్యలు బాధ్యతాయుతమైన వ్యక్తుల నుంచి రావడం మరింత ఆందోళనకరమని అది వారి చెడిపోయిన మెదడుకు ఓ ఉదాహరణ అని ఈ విషయాన్ని సదరు పార్టీ పెద్దలు కూడా గ్రహించాలని బాబా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం కంగనా, రాందేవ్ బాబాల మధ్య జరిగిన ఈ మాటల యుద్ధం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.