ఒకసారి కూర్చుంటే మళ్లీ మళ్లీ కావాలంటారు..

ABN , Publish Date - Mar 13 , 2026 | 07:09 PM

అల్లు అరవింద్‌ తన విజన్‌తో కోకాపేటలోని ‘అల్లు సినిమాస్‌’ పేరుతో భారీ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. ఇది ఇండియాలోనే మొదటి డాల్బీ సినిమా స్క్రీన్‌.


అల్లు అరవింద్‌ తన విజన్‌తో కోకాపేటలోని
‘అల్లు సినిమాస్‌’ పేరుతో భారీ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. ఇది ఇండియాలోనే మొదటి డాల్బీ సినిమా స్క్రీన్‌. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డాల్బీ సినిమా స్క్రీన్స్‌ లో ఇది మూడవది. తాజాగా దీనిని ప్రారంభించారు. మరి డాల్బీ స్క్రీన్  ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.

డాల్బీ సినిమా ప్రత్యేకతలు ఇవే.. 

  • 75 అడుగుల వెడల్పు ఫ్లాట్ యాస్పెక్ట్ రేషియోలో స్క్రీన్ ఏర్పాటు..

  • డాల్బీ సినిమా స్క్రీన్ పై 2డీ, త్రీడీ సినిమాను అద్భుతంగా ఎక్స్‌పీరియన్స్‌ చేయవచ్చు.

  • ఇందులో 78 ఇండివిడ్యువల్‌ సరౌండ్‌ స్పీకర్స్‌ ఉంటాయి.
    ఇది కాకుండా 128 సైమల్టేనియస్‌ సౌండ్‌ అవుట్‌లెట్స్‌ (స్పీకర్స్‌) ఉంటాయి.

  • అయితే ఈ థియేటర్‌లో అట్మాస్‌ సబ్‌ ఊఫర్స్‌, సరౌండ్‌ స్పీకర్స్‌ బయటకు కనిపించవు. సీలింగ్‌, వాల్‌పై పలుచని తెర వెనక అమర్చుతారు.

  • వీటి వల్ల సౌండింగ్‌లో ప్రతి డైమెన్షన్‌ను ఆస్వాదించవచ్చు. 

  • 648 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ఈ ఫ్లాగ్‌షిప్ డాల్బీ సినిమా ఆడిటోరియం ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ సైజులలో ఒకటి. 

  • ఆడిటోరియం డాల్బీ సినిమా డిజైన్ ప్రమాణాల ప్రకారం అమలు చేయబడిన డ్యూయల్ డాల్బీ విజన్ 6P లేజర్ ప్రొజెక్షన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. 

  • డాల్బీ 3D ద్వారా.. పిచ్-బ్లాక్ ఆడిటోరియంలు పర్‌ఫెక్ట్ కాంట్రాస్ట్ కోసం రూపొందించబడ్డాయి. ఎక్స్‌ట్రీమ్ బ్రైట్ నెస్, డీపర్ బ్లాక్స్,  వైబ్రెంట్ కలర్స్‌తో ఉత్కంఠభరితమైన విజువల్స్‌ను అందిస్తాయి. 

  • 64-ఛానల్ డాల్బీ అట్మాస్ ఇమ్మర్సివ్ ఆడియో సిస్టమ్ సౌండ్స్ తో ఓ  కొత్త లోకానికి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తుంది. 

ఓ మైలు రాయిగా అల్లు స్టూడియోస్‌
‘అల్లు సినిమాస్’ భారతదేశ వినోద రాజధానికి మరో మైలురాయిగా నిలుస్తుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, కోకాపేట, నార్సింగి, నానక్‌రామ్‌గూడ, మోకిలాతో పాటుగా రాబోయే నియోపోలిస్ నుండి పట్టణ, శివారు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది. ఫ్యామిలీ, కార్పొరేట్‌లు, హై-ఎండ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇష్టపడే సినీ ప్రియుల కోసం ఈ ‘అల్లు సినిమాస్’ను నిర్మించారు.

Updated Date - Mar 13 , 2026 | 08:00 PM