సౌత్‌లో.. రిచ్చెస్ట్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా!

ABN , Publish Date - Mar 24 , 2026 | 06:34 PM

హీరోలు గొప్ప... హీరోయిన్లు గొప్పా? ఏ విషయంలో పారితోషికం, స్టార్మ్, పాలోయింగ్, .. ఇంకా చాలా విషయాల్లో! ఒకప్పుడు ఇలా ప్రశ్నిస్తే తడుముకోకుండా హీరోలే గొప్ప.. అనే సమాధానం వినిపించేది.

actresses

ఒకప్పుడు ఇలా ప్రశ్నిస్తే తడుముకోకుండా హీరోలే గొప్ప.. అనే సమాధానం వినిపించేది. ఆ రోజుల్లో పారి తోషికం, పాలోయింగ్, స్టార్డమ్. ఇలా అన్నింటిలోనూ హీరోలదే పై చేయిగా ఉండేది. 'హీరోలతో సమానంగా మేం కూడా కష్టపడుతున్నాం కదా. మరి వాళ్లకు ఇచ్చే పారితోషికం మాకు ఎందుకు ఇవ్వరు! అని ఒకరిద్దరు హీరోయిన్లు డిమాండ్ చేసినా పట్టించుకొనే పరిస్థితి ఉండేది కాదు. గ్లామర్ పరంగా హీరోయిన్లను ఎంత వరకూ ఉపయోగించుకోవాలో అంతే స్థాయిలో పారితో షికం ఇచ్చేవారు నిర్మాతలు.

కానీ ఇప్పుడలా కాదు. హీరోలతో సమానంగా కాదు కానీ దాదాపు ఆ స్థాయిలోనే కొందరు హీరోయిన్ల పారితోషకాలు ఉంటున్నాయి. దక్షిణాదిలో కొంతమంది హీరో యిన్లు తీసుకుంటున్న పారితోషికం ఫిగర్లు వింటుంటే 'అమ్మో.. అంతా!' అనిపించక మానదు. సౌత్‌లో ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు ఉన్నా వాళ్లలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వాళు కొందరే వారిలో టాప్ నయనతార (Nayanthara) అని చెబుతున్నారు.

నయనతార సినిమాకు రూ. పది కోట్లు తీసుకుంటుందని సమాచారం. ఇక ఆమె వ్యక్తిగత ఆస్తుల విలువ రూ.300 కోట్లకు పై మాటే అని కూడా చెబుతున్నారు. సినిమాలు, యాడ్స్, మరో పక్క సొంత చిత్ర నిర్మాణం.. ఇవి ఆమె పెరుగుతున్న సంపదకు కారణాలు. ఏదైన యాడ్ చేయడానికి రూ. 5 కోట్లు నయనతార తీసుకుంటుందని చెబుతారు. ప్రాపర్టీతో పాటు రూ.50 కోట్లు విలువ చేసే ప్రైవేట్ విమానం కూడా నయన‌తారకు ఉందని అంటున్నారు తెలుగులో సీనియర్ హీరోల సరసన నటించాలంటే అందరికీ ముందు గుర్తు వచ్చే పేరు నయనతార. అందుకే తమిళ, తెలుగు చిత్రాలతో బిజీగా ఉంటూ రెండు చేతులా సంపాదిస్తోంది ఈ మలయాళ కుట్టి.

నయనతార తర్వాత స్థానంలో రష్మిక మంద‌న్న (Rashmika Mandanna) ఉందని చెప్పాలి. సినిమాకు రూ. 8 కోట్లు తీసుకునే ఆమె 'పుష్ప 2' చిత్రం కోసం మాత్రం రూ. పది కోట్లు తీసుకుందని సమా చారం. గత నెలలోనే హీరో విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకున్న రష్మిక నటిగా మరింత మంచి పేరు తెచ్చు కోవడానికి ఆడుగులు వేస్తోంది. ఇక అనుష్క (Anushka Shetty) ఈ మధ్య సినిమాల సంఖ్య బాగా తగ్గించుకున్నప్పటికీ అత్యధిక పారితోషికం తీసుకునే పది మంది హీరోయిన్లలో ఆమె పేరు కూడా ఉంది. అనుష్క ఆస్తుల విలువ రూ.135 కోట్లకు పైనే అని చెబుతున్నారు.

ఇక‌.. ఆ వ‌రుస‌లో హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) కూడా ముందు వ‌రుస‌లోనే ఉంది. ఇప్పుడు ఆమె నుంచి వ‌చ్చే సినిమాల సంఖ్య తగ్గినప్పటికీ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సమంత ఆస్తుల విలువ కూడా రూ110-120 కోట్ల మధ్యలో ఉంటుందని అంటున్నారు. ఇటీవ‌లే నిర్మాత‌గా కూడా మారి సినిమాలు నిర్మిస్తోంది. ఈ క్ర‌మంలో తానే హీరోయిన్‌గా న‌టించ‌డంతో పాటు స్వ‌యంగా నిర్మించిన 'మా ఇంటి బంగారం' చిత్రం మే నెలలో విడుదల కానుంది. ఇదంతా చూస్తుంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని పెద్దలు చెప్పిన విషయాన్ని సినిమా హీరోయిన్లు చక్కగా పాటిస్తున్నట్లు అంద‌రికీ అర్థమయ్యే విష‌య‌మే.

Updated Date - Mar 24 , 2026 | 06:56 PM