అస‌లు పావ‌లా శ్యామ‌ల‌కు.. ఉన్న ఆరోగ్య స‌మ‌స్యేంటో తెలుసా!

ABN , Publish Date - May 17 , 2026 | 08:10 AM

సీనియర్ నటి పావలా శ్యామల అస్వస్థతతో హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్‌లో ఏముందంటే..

Pavala Shyamala

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న‌ సీనియర్ నటి పావలా శ్యామల (Pavala Syamala) గ‌త కొంత‌కాలంగా అస్వస్థతతో ఇబ్బంది ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రసాద్ హాస్పిటల్స్‌లో ఆమెకు చికిత్స కొనసాగుతోండ‌గా ఆమె ఆరోగ్య పరిస్థితిపై ప్ర‌సాద్స్ ఆస్ప‌త్రి (Prasad Hospitals) వైద్యులు తాజాగా కీలక ప్రకటన విడుదల చేశారు.

వైద్యుల వివరాల ప్రకారం.. పావలా శ్యామల (78) గత కొంతకాలంగా హై బీపీ, కరోనా ఆర్టరీ వ్యాధి (CAD), పార్కిన్సన్స్ వంటి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. రెగ్యులర్ మెడికేషన్ తీసుకోని పరిస్థితిలో మే 16, 2026 ఉదయం 6:30 గంటలకు ఇటీవల తీవ్రమైన కడుపు నొప్పి, జీర్ణ సంబంధ ఇబ్బందులు, మలబద్ధకం కారణంగా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

Pavala Shyamala

అత్యవసరంగా నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు అక్యూట్ సివియర్ గ్యాస్ట్రిటిస్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అంతేకాదు, అల్ట్రాసౌండ్ (USG Abdomen) పరీక్షలో కామన్ బైల్ డక్ట్ (CBD) విస్తరించినట్లు గుర్తించడంతో మరిన్ని పరీక్షలు చేపట్టినట్లు వెల్లడించారు. మరింత స్పష్టమైన వివరాల కోసం CECT Abdomen స్కాన్ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం పావలా శ్యామలకు ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్‌తో పాటు అవసరమైన సపోర్టివ్ ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుత‌ ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. మరిన్ని పరీక్షల అనంతరం పూర్తి హెల్త్ బులెటిన్ సోమ‌వారం విడుదల చేస్తామని పేర్కొన్నారు. పావలా శ్యామల త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.

Updated Date - May 17 , 2026 | 09:27 AM