Trivikram: రాజుగారికి గురూజీ ప్రశంసలు..

ABN , Publish Date - Jan 15 , 2026 | 08:01 PM

ఈ ఏడాది సంక్రాంతి సినిమాలు ఏది అభిమానులను అంతగా నిరాశపర్చలేదు. అన్ని సినిమాలు ఒకదాన్ని మించి ఇంకొకటి ఉన్నాయి.

Trivikram

Trivikram: ఈ ఏడాది సంక్రాంతి సినిమాలు ఏది అభిమానులను అంతగా నిరాశపర్చలేదు. అన్ని సినిమాలు ఒకదాన్ని మించి ఇంకొకటి ఉన్నాయి. ఇక సంక్రాంతి ఎంటర్టైనర్ గా నిలిచింది అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju). నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అని ప్రేక్షకులు నమ్ముతారు. నవీన్ సైతం ఆ నమ్మకాన్ని కోల్పోలేదు. అనగనగా ఒక రాజు సినిమా మంచి హిట్ ను అందుకుంది. మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించారు. ఇక ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటించింది.

సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా నవీన్ వన్ మ్యాన్ షో అని చెప్పుకొస్తున్నారు. ఇక తాజాగా అనగనగా ఒక రాజు చిత్ర బృందాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రశంసించాడు. నాగవంశీ ఆఫీస్ లో నవీన్, మీనాక్షీని త్రివిక్రమ్ శాలువా కప్పి సన్మానించాడు. అనంతరం కేక్ కట్ చేసి, చిత్ర యూనిట్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. సినిమా చాలా బాగుందని, నవీన్ కామెడీ అదిరిపోయిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

త్రివిక్రమ్ సినిమాల విషయానికొస్తే.. వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం అనే సినిమా చేస్తున్నాడు. దీని తరువాత గాడ్ ఆఫ్ వార్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ తో ఉంటుందా.. ? అల్లు అర్జున్ తో ఉంటుందా.. ? అనేది మిస్టరీగా మారింది. మరి ఈ రెండు సినిమాలతో త్రివిక్రమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Jan 15 , 2026 | 08:11 PM