Teja: దర్శకుడు తేజ కుమారుడికి టోకరా.. రూ.63 లక్షలు కాజేసిన దంపతులు

ABN , Publish Date - Jan 14 , 2026 | 06:18 AM

ట్రేడింగ్‌లో భారీ లాభాలు వస్తాయని ఆశ చూపి ప్రముఖ సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజను హైదరాబాద్‌కు చెందిన ఓ దంపతులు నిలువునా ముంచారు.

teja

ట్రేడింగ్‌లో భారీ లాభాలు వచ్చేలా చేస్తామని నమ్మించి.. ప్రముఖ సినీ దర్శకుడు (తేజ) కుమారుడు అమితవ్ తేజ (Amitov Teja) ను హైదరాబాద్‌కు చెందిన దంపతులు నిలువునా ముంచారు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి అమితవ్ వద్ద నుంచి రూ. 63లక్షలు కాజేసినట్లు ఆ దంపతులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వృత్తిరీత్యా వ్యాపార వేత్త అయిన అమితవ్ తేజ హైదరాబాద్‌లో ఉంటున్నారు.

2025 ఏప్రిల్లో మోతీనగర్‌కు చెందిన యార్లగడ్డ అనూష, కొండపనేని ప్రణీత్ దంపతులతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే ఊహించని లాభాలు ఇప్పిస్తామని, ఒకవేళ నష్టం వస్తే తాముంటున్న అపార్ట్మెంట్ ఫ్లాట్‌ను ఇస్తామని హామీ ఇచ్చారు. దంపతుల మాటలు నమ్మిన అమితవ్.. పెట్టుబడులు పెట్టారు.

వారం రోజుల తరువాత రూ. 9 లక్షలు లాభం వచ్చిందంటూ నింది తులు కొన్ని నకిలీ పత్రాలను చూపించారు. దీనిని నిజమని నమ్మిన అమితవ్, విడతల వారీగా మొత్తం రూ.63 లక్షలు వారికి అందజేశారు. రోజులు గడు స్తున్నా లాభాలు రాకపోగా.. అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో మోస పోయినట్టు గ్రహించిన అమితవ్ తేజ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.

Updated Date - Jan 14 , 2026 | 06:37 AM