సింగిల్ టేక్ ఆర్టిస్ట్ బిడ్డ వివాదం.. క్లారిటీ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల
ABN , Publish Date - Sep 27 , 2026 | 04:56 PM
న్యాచురల్ స్టార్ నాని, కయాదు లోహార్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది ప్యారడైజ్. ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 24 న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజు మిక్స్డ్ టాక్ అందుకున్నా.. ఆ తరువాత పాజిటివ్ టాక్ ని రాబడుతోంది.
న్యాచురల్ స్టార్ నాని, కయాదు లోహార్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది ప్యారడైజ్. ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 24 న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజు మిక్స్డ్ టాక్ అందుకున్నా.. ఆ తరువాత పాజిటివ్ టాక్ ని రాబడుతోంది. ఇక కలక్షన్స్ విషయానికొస్తే.. అంత నెగిటివిటీ తెచ్చుకున్నా కూడా మూడు రోజుల్లో రూ. 136 కోట్లు సాధించి రికార్డులు సృష్టిస్తోంది. ఇంకోపక్క నాని, శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాపై హైప్ పెంచడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే గతరాత్రి సక్సెస్ మీట్ నిర్వహించి సెట్ లో జరిగిన గొడవల గురించి క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా సినిమాలో ప్రశ్నలుగా మిగిలిపోయిన ఎన్నో సీన్స్ పై ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి సమాధానాలు చెప్పుకొచ్చారు.
నాని - శ్రీకాంత్ ఓదెల సినిమా రిలీజ్ తరువాత ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో నాని.. సినిమాలో ట్రోలర్స్ ట్రోల్ చేసిన సీన్స్ కి క్లారిఫికేషన్ అడిగాడు. ప్యారడైజ్ రిలీజ్ అయ్యాక ఎక్కువ ట్రోల్ అయ్యింది కయాదు సీన్స్. తండ్రి చనిపోయాక ఆయన చేసిన అప్పును తీర్చడానికి బి గ్రేడ్ సినిమాలు చేస్తుంది. ఆ సినిమాలను తల్లే దగ్గరుండి షూట్ చేస్తుంది. అప్పుడు కూతురు బట్టలు విప్పి నటిస్తుంటే నువ్వు సింగిల్ ఆర్టిస్ట్ వి బిడ్డా అంటుంది. ఆ డైలాగ్ వివాదానికి దారితీసింది. కన్నతల్లి అయ్యి ఉండి.. కూతురిని అనాల్సిన మాటేనా అంటూ నెటిజన్స్ ఫైర్ అయ్యారు. ఎలా ఇంత చెత్త డైలాగ్స్ రాసావు అంటూ డైరెక్టర్ పై మండిపడ్డారు.
అయితే ఈ డైలాగ్ రాసుకోవడానికి వెనుక తన ఇంటెన్షన్ వేరు అని శ్రీకాంత్ ఓదెల చెప్పుకొచ్చాడు. కూతురు హీరోయిన్ అవ్వాలని ఇంట్లో నుంచి పారిపోయినప్పుడు.. తల్లి అనుకుంటుంది.. దీనికి యాక్టింగ్ రాదు.. ఎప్పటికైనా ఇది ఇక్కడకు రావాల్సిందే అని.. అలాంటి ఆలోచన ఉన్న తల్లి.. కూతురు యాక్టింగ్ చూసి.. నా కూతురిలో ఇంత మంచి నటన ఉందా.. అవకాశం వచ్చి ఉంటే పెద్ద స్టార్ అయ్యేది అని అనుకోని నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ బిడ్డ అని చెప్తుంది. నా ఇంటెన్షన్ కరెక్ట్.. కానీ, అది చూపించాలేకపోయాను అని చెప్పుకొచ్చాడు.