Yash: దర్శకురాలు ప్రతి విషయంలో క్లారిటీగా ఉన్నారు

ABN , Publish Date - Apr 25 , 2026 | 07:41 PM

యశ్‌ హీరోగా గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘టాక్సిక్‌’. కెవిఎన్‌ ప్రొడక్షన్‌ సంస్థ భారీ వ్యయంతో నిర్మిస్తోంది.


యశ్‌ (yash) హీరోగా గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘టాక్సిక్‌’ (toxic). కెవిఎన్‌ ప్రొడక్షన్‌ సంస్థ భారీ వ్యయంతో నిర్మిస్తోంది. టీజర్‌ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాలో రొమాంటిక్‌ సీన్స్‌ గురించి చర్చనీయాశంగా మారింది. అందులో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ దర్శకురాలిపై కామెంట్‌ చేశారు. ఈ సన్నివేశాల గురించి యశ్‌ సినిమాకాన్‌ వేడుకలో స్పందించారు.

‘ఈతరహా గ్యాంగ్‌స్టర్‌ చిత్రాలను మేల్‌ డైరెక్టర్స్‌ తెరకెక్కిస్తారు. వారైతేనే బాగా తీర్చిదిద్దుతారని చాలామంది అనుకుంటారు. ఈ యాక్షన్‌ చిత్రాన్ని ఒక మహిళా దర్శకురాలు తెరకెక్కించడం వల్ల సరికొత్తగా ఉంటుంది. ఇందులోని శృంగార సన్నివేశాల నుంచి యాక్షన్‌ సీన్స్‌ వరకు ప్రతి దానిలోనూ ఆమె ఆలోచనలు చాలా క్లారిటీగా ఉన్నాయి. సున్నితమైన భావాలను హృద్యంగా చూపించారు. యాక్షన్‌ సన్నివేశాలనూ అదే స్థాయిలో చిత్రీకరించారు. ఓ లేడీ డైరెక్టర్‌ అన్ని కోణాలను ఇంత బాగా డీల్‌ చేయగలరా అని నాకు ఆమెతో పని చేశాకే తెలిసింది. సినిమాలో ప్రతి సన్నివేశం గతంలో ఎక్కడా చూడని విధంగా ఆమె తీర్చిదిద్దారు. గీతూ గొప్ప రచయిత కూడా. ఈ సినిమాలో మాటలతో కూడా ఆకట్టుకుంటుంది’ అని అన్నారు. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. జూన్‌ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Updated Date - Apr 25 , 2026 | 07:43 PM