N. Shankar: దర్శకుడు ఎన్. శంకర్‌కు.. మాతృ వియోగం

ABN , Publish Date - Jan 28 , 2026 | 10:49 AM

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు.. శ్రీరాములయ్య, భద్రాచలం, జయం మనదేరా, ఆయుధం, జైబోలో తెలంగాణ చిత్రాల ఫేమ్ శంక‌ర్ ఇంట విషాదం నెల‌కొంది.

N. Shankar

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు.. శ్రీరాములయ్య, భద్రాచలం, జయం మనదేరా, ఆయుధం, జైబోలో తెలంగాణ చిత్రాల ఫేమ్ శంక‌ర్ (Nimmala Shankar) ఇంట విషాదం నెల‌కొంది. ఆయ‌న మాతృమూర్తి సక్కుబాయమ్మ (Sakkubayamma) ఈ రోజు ఉద‌యం తుదిశ్వాస విడిచారు. ఆమె అంతిమ సంస్కారాలు గురువారం మ‌హా ప్ర‌స్తానంలో జ‌రుగ‌నున్నాయి. అభిమానులు రేపు ఉదయం HIG block 11,చిత్రపురి కాలనీ, హైద్రాబాద్‌లో భౌతిక కాయాన్ని సందర్శించవచ్చు శంక‌ర్ స్వ‌గ్రామం న‌ల్ల‌గొండ జిల్లా మాడ్గుల‌ప‌ల్లి మండ‌లం చిరుమ‌ర్తి.

Updated Date - Jan 28 , 2026 | 11:03 AM