Director Maruthi: శునకానందం.. మిమ్మల్ని కర్మ వదిలిపెట్టదు.. శాపాలు పెట్టిన మారుతీ
ABN , Publish Date - Jan 13 , 2026 | 08:59 PM
డైరెక్టర్ మారుతీ (Maruthi).. ట్రోలర్స్ పై మండిపడ్డాడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదని, ఏదో ఒకరోజు వారు కూడా అనుభవిస్తారని శాపాలు పెట్టుకొచ్చాడు. ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ద రాజా సాబ్ (The Raja Saab)
Director Maruthi: డైరెక్టర్ మారుతీ (Maruthi).. ట్రోలర్స్ పై మండిపడ్డాడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదని, ఏదో ఒకరోజు వారు కూడా అనుభవిస్తారని శాపాలు పెట్టుకొచ్చాడు. ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ద రాజా సాబ్ (The Raja Saab). మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లగా నటించారు. ఎన్నో అంచనాలతో రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది. చాలామంది ఈ సినిమాకు నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేశారు. మారుతీకి కథలు రాయడం రాదని, సినిమా తీయడం తెలియదని చెప్పుకొచ్చారు. ప్రభాస్ ని ఇంకెప్పుడు ఇలాంటి సినిమాలను ఒప్పుకోవద్దని సలహాలు ఇచ్చారు.
ఇక రాజా సాబ్ నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేసినవారిపై మారుతీ మండిపడ్డాడు. తాజాగా గూగుల్ మీట్ లో జరిగిన ప్రెస్ మీట్ లో తన ఆవేదనను వెళ్లగక్కాడు. సినిమా తీయడం నాకు రావడం కాదు.. చూడడం మీకు రాదు అని ఫైర్ అయ్యాడు. ఒకసారి చూస్తే సినిమా అర్ధం కాదని, మరోసారి వెళ్లి చూడమని సలహా ఇచ్చాడు. ఇక హీరోల మీద, సినిమా మీద ట్రోల్ చేసేవారికి మారుతీ శాపనార్ధాలు పెట్టాడు. అది శాపం కాదు తన బాధ అని చెప్తూనే వారు అనుభవిస్తారని శాపం పెట్టుకొచ్చాడు.
' గుర్తుపెట్టుకోండి.. 3 సంవత్సరాల కష్టం 3 గంటలు సినిమా తీసి చూపిస్తుంటే ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేస్తున్నారు. సక్సెస్, ఫైయిల్యూర్ అని తేడా లేకుండా అన్నింటి మీద ట్రోల్స్ చేస్తున్నారు. వారి కష్టంపై జోక్స్ వేస్తూ శునకానందం పొందుతున్నారు. ఇంకొందరు తాము మేధావులు అనుకుంటూ సినిమా నచ్చింది అని చెప్పినవారిపై కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఇదంతా నేచర్ చూస్తుంది.
ట్రోల్స్ చేసినవారు ఏదో ఒకరోజు బాధపడతారు. నేను ట్రోల్స్ చేసాను అని ఒక్కరే కూర్చొని అనవసరం ట్రోల్ చేశాను అని ఏడుస్తారు. ఇదంతా వాళ్లకు తిరిగి వస్తుంది. ఇది నా శాపం కాదు. నా బాధ. కచ్చితంగా వారిని కర్మ వదిలిపెట్టదు' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మారుతీ ఇలా మాట్లాడడం చాలామందికి నచ్చలేదు. దీనిపై కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. మరి దీనిపై ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి.