సైలెంట్ గా పని కానిచ్చేస్తున్న క్రిష్..

ABN , Publish Date - May 30 , 2026 | 06:07 PM

టాలీవుడ్‌లో విలక్షణ కథలను తెరకెక్కించే అభిరుచి గల దర్శకుడిగా క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) కి ప్రత్యేక గుర్తింపు ఉంది. గమ్యం, వేదం, కంచె వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన ఆయన, గత ఏడాది అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో వచ్చిన ఘాటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Director Krish

టాలీవుడ్‌లో విలక్షణ కథలను తెరకెక్కించే అభిరుచి గల దర్శకుడిగా క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) కి ప్రత్యేక గుర్తింపు ఉంది. గమ్యం, వేదం, కంచె వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన ఆయన, గత ఏడాది అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో వచ్చిన ఘాటీ (Ghaati) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఘాటీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా కోసమే క్రిష్.. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్నాడు. కానీ, ఘాటీ వరుస వాయిదాలు, సరైన ప్రమోషన్స్ లేకపోవడం వలన ప్రేక్షకులు ఆదరించలేదు.


ఇక ఘాటీ తరువాత పూర్తిగా సైలెంట్ అయ్యిన క్రిష్ తాజాగా తన కొత్త సినిమాను పట్టాలెక్కించినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఎటువంటి హడావుడి లేకుండా నిశ్శబ్దంగా ఈ సినిమాను పూర్తిచేసే పనిలో పడ్డాడట. క్రిష్ తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని ఒక సరికొత్త ప్రయోగానికి ఈ సినిమాతో శ్రీకారం చుట్టనున్నాడట. ఈసారి స్టార్ హీరోలు, క్రేజీ నటీనటులతో కాకుండా.. పూర్తిగా కొత్త నటీనటులతో ఒక ఇంట్రెస్టింగ్ సర్వైవల్ డ్రామా కథాంశాన్ని ఆయన ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల అడవుల్లో జరుగుతోందని టాక్


ఎప్పట్లాగే ఆయన సొంత నిర్మాణ సంస్థ అయిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పైనే ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యాక, ఫస్ట్ లుక్ కానీ, గ్లింప్స్ ద్వారా ఒకేసారి సర్ప్రైజ్ ఇస్తూ ఈ ప్రాజెక్ట్ వివరాలను అధికారికంగా ప్రకటించాలని క్రిష్ భావిస్తున్నాడట. మరి ఈ వినూత్నమైన ప్రయోగంతో క్రిష్ మళ్లీ ఫార్మ్ లోకి వస్తాడా.. లేదా అనేది చూడాలి.

Updated Date - May 30 , 2026 | 06:23 PM