వృషకర్మ: దర్శకుడి పుట్టినరోజు.. అప్డేట్ ఇచ్చిన మేకర్స్
ABN , Publish Date - Mar 02 , 2026 | 09:17 PM
అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘వృషకర్మ’ (Vrushakarma). ‘విరూపాక్ష’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్‌తో సూపర్ హిట్ అందుకున్న కార్తీక్ వర్మ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury) కథానాయిక. సోమవారం దర్శకుడు కార్తీక్ దండు పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ అప్‌డేట్‌ను ప్రకటించారు. ఈ నెల 5న ‘వృషకర్మ’ గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు.