Gunasekhar: ఆ సినిమా కోసం ఏడేళ్లు టైమ్ వేస్ట్ చేశా

ABN , Publish Date - Jun 01 , 2026 | 07:27 PM

టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ (Guna Sekhar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన సినిమాలు తీయడం తగ్గించారు.

Gunasekhar

టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ (GunaSekhar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన సినిమాలు తీయడం తగ్గించారు. అడపాదడపా సినిమాలు చేస్తున్న గుణశేఖర్ ఈ ఏడాది యుఫోరియా అనే సినిమా చేశారు. ఈ సినిమా థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు కానీ, ఓటీటీలో మాత్రం భారీ విజయాన్ని అందుకుంది.


తాజాగా గుణశేఖర్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఎప్పటి నుంచో గుణశేఖర్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా హిరణ్యకశ్యప తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి. కొన్నేళ్ళ క్రితం ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సమాచారం. తాజాగా ఈ ప్రెస్ మీట్ లో హిరణ్యకశ్యప గురించి గుణశేఖర్ క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏడేళ్ళు టైమ్ వేస్ట్ చేసినట్లు తెలిపారు.


'హిరణ్యకశ్యప కోసం ఏడేళ్లు టైమ్ వేస్ట్ అయింది. రానా నేను కలిసి వర్క్ మొదలుపెట్టాం. ఫాక్స్ స్టార్ తో టైఅప్ అయ్యాం.. 300 కోట్ల బడ్జెట్ అనుకున్నాం. కరోనా అనంతరం ఫాక్స్ స్టార్ ను డిస్నీ కొనుగోలు చేసింది. వారు మా‌ ప్రాజెక్టు వయోబుల్ కాదని ఫీలయ్యారు. ఈ లోపు నా ఐడియాలతో అనేక సినిమాలు వేరే వారు తీసి హిట్స్ కొట్టారు. అష్టదిగ్బాలకులను డిజైన్ చేసిన విధానం ముందు ఎవెంజర్స్ నథింగ్. ఈ మధ్య మహావతార నరసింహా వచ్చి బ్లాక్ బస్టర్ అయింది.కానీ నా విజువైలెజైషన్ ను ఫాక్స్ స్టార్ వాళ్లు నమ్మారు‌. రానా, త్రివిక్రమ్ హిరణ్యకశ్యపకు మాటలు మాత్రమే రాస్తారని అన్నారు. నాకు త్రివిక్రమ్ కూడా ఫోన్ చేసి మాట్లాడారు. దాన్ని యానిమేషన్ ఫార్మాట్ లో అంతా సిద్దం చేశాం.. కానీ దాన్ని మేము లైవ్ యాక్షన్ గా తీద్దామనే వెయిట్ చేస్తున్నాం. రాబోయే సినిమా కధ కూడా హార్ట్ హిట్టింగ్ గా ఉంటుంది. వీలైనంత త్వరగా సినిమా తీయాలనే ఉత్సహాంలో ఉన్నాను' అంటూ తెలిపారు.

Updated Date - Jun 01 , 2026 | 07:51 PM