Boyapati Srinu: త్వ‌ర‌లో అఖండ 3 ఉంటుంది.. చిరంజీవి, బాలకృష్ణల‌తో మల్టీ స్టారర్‌ చేస్తా

ABN , Publish Date - Oct 05 , 2026 | 09:01 AM

ప్ర‌ముఖ దర్శకుడు బోయపాటి శ్రీను సోమ‌వారం ఉద‌యం తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ త‌న రాబోవు సినిమాల విష‌యంలో ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Boyapati Srinu Tirumala

ప్ర‌ముఖ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) సోమ‌వారం ఉద‌యం తిరుమల శ్రీనివాసుడిని (Tirumala Tirupati Devasthanams)దర్శించుకున్నారు.శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న శ్రీను విఐపి బ్రేక్ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారీ వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.

ఈ నెలాఖరు లోపల నూతన ప్రాజెక్ట్ ని ప్రకటిస్తానని..అనవాయితీ ప్రకారం ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు శ్రీవారి ఆశీస్సులు పొందానని బోయపాటి శ్రీను తెలిపారు. అఖండ 3 కూడా ఉంటుందని..సరైన సమయంలో బాలకృష్ణతో కలిసి వివరాలు ప్రకటిస్తానన్నారు. అవకాశం అభిస్తే చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna)ల‌తో మల్టీ స్టారర్ సినిమా కచ్చితంగా చేస్తానన్నారు.

Updated Date - Oct 05 , 2026 | 09:30 AM