Anil Ravipudi: ఇళయరాజా కేసు.. క్లారిటీ ఇచ్చిన అనిల్
ABN , Publish Date - Jan 13 , 2026 | 08:06 PM
మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. చాలా గ్యాప్ తరువాత చిరంజీవి (Chiranjeevi) ఒక మంచి హిట్ ను అందుకున్నాడు.
Anil Ravipudi: మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. చాలా గ్యాప్ తరువాత చిరంజీవి (Chiranjeevi) ఒక మంచి హిట్ ను అందుకున్నాడు. వరుసగా 9 వ సారి డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తన విజయపరంపరను కొనసాగించాడు. మెగా ఫ్యాన్స్ చాలా కాలం తరువాత వింటేజ్ చిరును చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అచ్చమైన సంక్రాంతి సినిమా అంటూ కుటుంబాలు సంబరాలు చేసుకుంటున్నాయి. చిరు - వెంకీ కాంబోకు అందరూ ఫిదా అవుతున్నారు. మొదటి రోజే రూ. 85 కోట్లు వసూళ్లు చేసి ఈ సినిమా రికార్డులు కొల్లగొడుతుంది.
అయితే ఇన్ని ఆనందాల మధ్య నెటిజన్స్ ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన శంకరవరప్రసాద్ సినిమాలో మెయిన్ హైలైట్ గా నిలిచింది సుందరి సాంగ్. చిరు- నయన్ మధ్య ప్రేమ పుట్టడానికి కారణం ఈ సాంగ్.. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఈ సాంగ్ ను అనిల్ వాడాడు. రజినీకాంత్, శోభన నటించిన దళపతి సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ఇది. దీనికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించాడు. ఇక గత కొన్నేళ్లుగా ఇళయరాజా.. ఏ సినిమాలో అయినా తాను కంపోజ్ చేసిన మ్యూజిక్ కానీ, సాంగ్ కానీ తన పర్మిషన్ లేకుండా కనుక వాడితే కేసులు వేస్తున్న విషయం తెల్సిందే. మంజుమ్మెల్ బాయ్స్ దగ్గరనుంచి డ్యూడ్ వరకు ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అలాగే సుందరి సాంగ్ వాడినందుకు చిరు సినిమాపై కూడా ఇళయరాజా కేసు వేస్తాడేమో అని అందరూ డౌట్ పడుతున్నారు.
తాజాగా ఈ సినిమా థాంక్స్ మీట్ లో అనిల్ రావిపూడి ఈ డౌట్ ని క్లియర్ చేశాడు. తమకు అలాంటి ప్రమాదం ఏది లేదని, ఎందుకంటే ఆ సాంగ్ ను ఇళయరాజా పర్మిషన్ తోనే వాడినట్లు చెప్పుకొచ్చాడు. ' ఇళయరాజా గారి గురించి చెప్పాలంటే.. చాలామంది ఆయన పాత వాడుకున్నారని .. కేసు వేసేస్తున్నారు అని అనుకుంటున్నారు. ప్రతిదానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆయన సాంగ్ ను వాడుకుంటున్నాం అనుకున్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్లి.. అడిగి, దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే వాటిని పూర్తిచేసుకొని వాడుకోవాలి. మా నిర్మాతలు వెళ్లి ఇళయరాజాగారిని కలిసి ఇలా మీ సాంగ్ ని చిరంజీవి గారి సినిమాకు వాడుతున్నాం అంటే.. వాడుకోండి అని అని అన్నారు. ప్రాసెస్ కరెక్ట్ గా ఉంటే ఆయన ఒప్పుకుంటారు' అని చెప్పుకొచ్చాడు. దీంతో ఇళయరాజా కేసు వేస్తాడు అనే అనుమానం పోయినట్టే.