పావలా శ్యామలకు దిల్ రాజు సాయం

ABN , Publish Date - May 16 , 2026 | 07:31 PM

టాలీవుడ్ లేడీ కమెడియన్ పావలా శ్యామల ( Pavala Syamala) దీనస్థితిలో ఉన్న విషయం తెల్సిందే. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె చివరి రోజుల్లో నరకం చూస్తోంది.

Pavala Syamala

టాలీవుడ్ లేడీ కమెడియన్ పావలా శ్యామల ( Pavala Syamala) దీనస్థితిలో ఉన్న విషయం తెల్సిందే. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె చివరి రోజుల్లో నరకం చూస్తోంది. ఆదరించేవారు లేక, చేతిలో డబ్బులేక ఆర్కే ఫౌండేషన్ లో తలదాచుకుంటుంది. ఇక గుండె సమస్యతో కొట్టుమిట్టాడుతోన్న పావలా శ్యామల, ఆమె కూతురు కూకట్ పల్లిలోని ఒక హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం వెళ్లగా.. వారు డబ్బు లేదని వెనక్కి పంపారు. ఎక్కడకు తీసుకెళ్ళాలో తెలియని క్యాబ్ డ్రైవర్ వారిని గత రాత్రి నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక ఆమెను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి పావలా శ్యామలను ఆర్కే ఫౌండేషన్ కి తరలించారు.


పావలా శ్యామల నడిరోడ్డుపై దిక్కులేని స్థితిలో ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలామంది ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా ఆదుకోవాలని కామెంట్స్ చేశారు. ఇక ఈ వార్త విన్న నిర్మాత దిల్ రాజు గొప్ప మనసు చాటుకున్నాడు. పావలా శ్యామలకు ఆర్థిక సాయం అందించాడు. తల్లీకూతురిని ఒక రూమ్ కి తరలించి వారికి అన్ని సమకూర్చేలా చేశాడు.


ఇక తమకు ఆపన్న హస్తం అందించిన దిల్ రాజుకు పావలా శ్యామల కృతజ్ఞతలు తెలిపింది. దిల్ రాజు మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పింది. దిల్ రాజు కి మా కష్టం చెప్పుకుంటే ఖచ్చితంగా సహాయం చేస్తాడని మా అమ్మ అన్ని ఇంటర్వ్యూలలో చెప్పింది.. ఇప్పటికీ మీ వద్దకు వచ్చింది. మీరు మాకు దేవుడితో సమానం అంటూ పావలా శ్యామల కూతురు తెలిపింది. ఈ విషయం తెలియడంతో దిల్ రాజు నిజంగానే దిల్ ఉన్న రాజు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - May 16 , 2026 | 07:40 PM