Toxic: ఈ సమయంలో దిల్ రాజుకు పెద్ద టాస్కే ఇది
ABN , Publish Date - Feb 06 , 2026 | 07:23 PM
రాకింగ్ స్టార్ యశ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండిమా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ (toxic). మార్చి 19న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది.
రాకింగ్ స్టార్ యశ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండిమా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ (toxic). గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి 19న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు (Dil raju) ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను రూ.120 కోట్లకు సొంతం చేసుకోవటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాను ఏపీ, తెలంగాణ హక్కుల కోసం మూడు అగ్ర సంస్థలు పోటీ పడగా చివరకు దిల్ రాజు కు ఈ డీల్ దక్కింది. దీంతో ఇటీవల ఇండియన్ సినీ హిస్టరీలో అత్యంత కీలకమైన డిస్ట్రిబ్యూషన్ డీల్స్‌లో ఒకటిగా నిలిచింది. దిల్ రాజు మాట్లాడుతూ ‘ఇండియన్ సినీ ఇండస్ట్రీలోని పెద్ద స్టార్స్‌లో యశ్ ఒకరు. కెజియఫ్ 2 తర్వాత ఆయన మార్కెట్ మరింతగా పెరిగింది. ఆయన నెక్ట్స్ సినిమా టాక్సిక్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత వస్తోన్న ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి ప్రెస్టీజియస్ మూవీని మా ఎస్‌వీసీ బ్యానర్‌పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుండటం చాలా ఆనందంగా ఉంది. యశ్‌తో ఇలాగే మరిన్ని సినిమాలు చేయాలని ఆశిస్తున్నాం’ అన్నారు. ఈ సినిమాను ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలున్నాయి.