అయ్యో.. రష్మిక గాయం ఎంత ప‌ని చేసింది

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:25 PM

రష్మిక మందన్న గాయంతో ‘మైసా’, ‘రణబాలి’ షూటింగ్స్‌పై ప్రభావం పడింది. తాజాగా అల్లు అర్జున్‌ ‘రాకా’ సినిమా షూటింగ్‌ కూడా దాదాపు 45 రోజులు ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది.

rashmika

ఒక్క క్షణం కూడా తీరిక లేని స్టార్‌ హీరోయిన్‌కి గాయమై విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే ఎంత నష్టం? ఒకటా? రెండా? ఎన్ని సినిమాల చిత్రీకరణలు ఆగిపోతాయి? రష్మిక (Rashmika Mandanna) పరిస్థితిని చూస్తున్న వారికి ఇప్పుడు ఈ విషయం చాలా బాగా అర్థమవుతోంది. ‘మైసా’ సినిమా కోసం పాట చిత్రీకరిస్తుండగా రష్మిక మందన్న కుడి వైపు తుంటి భాగానికి గాయమైంది. ఆరు వారాల రెస్ట్‌ ఎప్పుడు పూర్తవుతుందా... రష్మిక మళ్లీ ఎప్పుడెప్పుడు వస్తారా అని ‘మైసా’ (Mysaa) మేకర్స్‌ ఎదురు చూస్తున్నారు. అలాగే ‘రణబాలి’ (Ranabaali) సినిమా యూనిట్‌ కూడా రష్మిక‌ మునుపటిలా తుళ్లుతూ సెట్‌కి వచ్చే రోజు కోసం వెయిటింగ్‌.

rashmika

ఇటు అల్లు అర్జున్ (Allu Arjun) ‘రాకా’ మూవీ మీద కూడా ఈ ప్రభావం స్ప‌ష్టంగా కనిపిస్తోంది. దాదాపు రెండు నెలల పాటు ఆ షూట్‌లో ఆలస్యం చోటు చేసుకోవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. ‘రాకా’ (Raaka) సెట్‌లో రష్మిక డబుల్‌ యాక్టివ్‌గా ఉండాలి. సెప్టెంబర్‌ ఆఖరునగానీ, అక్టోబర్‌ మొదటివారంలోగానీ ఆమె సెట్‌కి వచ్చే అవకాశాలుండటంతో, ఆ ప్రకారమే షెడ్యూల్స్‌ ప్లాన్‌ చేస్తున్నాడ‌ట అట్లీ (Atlee).

Updated Date - Aug 18 , 2026 | 01:06 PM