RGV: స్టార్ హీరోయిన్ తో ఆర్జీవీ సీక్రెట్ పెళ్లి..
ABN , Publish Date - Jul 31 , 2026 | 07:07 PM
సేన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ (RGV), బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళ మటోండ్కర్ (Urmila Matondkar) కాంబినేషన్ అనగానే అప్పట్లో ఒక ఊపు ఊపిన సినిమాలే గుర్తుకొస్తాయి.
సేన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ (RGV), బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళ మటోండ్కర్ (Urmila Matondkar) కాంబినేషన్ అనగానే అప్పట్లో ఒక ఊపు ఊపిన సినిమాలే గుర్తుకొస్తాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వీరి కాంబోలో నాలుగు సినిమాలు వచ్చాయి. అసలు ఊర్మిళాను స్టార్ గా చేసింది వర్మనే అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. రంగీలా, సత్య, అంతం, గాయం లాంటి సినిమాల్లో ఊర్మిళా నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక అప్పట్లో వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యంపై పరిశ్రమలో ఎన్నో రకాల రూమర్లు ప్రచారంలో ఉండేవి. అయితే తాజాగా సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆర్‌జీవీ - ఉర్మిళా ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని ఆయన బాంబు పేల్చారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రముఖ ఆలయంలో ఆర్‌జీవీ, ఉర్మిళా ఎవరికీ తెలియకుండా రహస్య వివాహం చేసుకున్నారని, ఈ సీక్రెట్ మ్యాటర్ తనకు టాలీవుడ్‌కి చెందిన ఒక ప్రముఖ స్టార్ హీరో స్వయంగా వెల్లడించారని ఆయన తెలిపారు. ఆ స్టార్ హీరో చెప్పిన విషయాన్ని నిర్ధారించుకోవడానికి తాను ఉర్మిళకు ఫోన్ చేసి అడగ్గా, ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారని పేర్కొన్నాడు. అయితే ఫోన్ సంభాషణలో ఉర్మిళ ఎమోషనల్ అయినప్పటికీ.. ఈ పెళ్లి ఆరోపణలను మాత్రం ఆమె ఖండించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు సంచలనం సృష్టించిన వీరిద్దరి బంధం వెనుక ఇంత పెద్ద నిజం ఉందా అంటూ సినీ అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వర్మతో ఊర్మిళా పెళ్లి నిజమో కాదో తెలియదు కానీ, 2016 లో ఆమె మోహ్సిన్ అక్తర్ మీర్ ని వివాహమాడింది. కొన్నేళ్ళు ఈ జంట అన్యోన్యంగానే ఉన్నారు. ఆ తరువాత విభేదాలు తలెత్తడంతో 2024 లో విడిపోయారు. ప్రస్తుతం ఊర్మిళా సింగిల్ గానే ఉంటుంది. ఆమెకు పిల్లలు లేరు. మరి ఊర్మిళా నిజంగానే వర్మను పెళ్లాడిందా.. ? ఈ విషయాన్ని ఎందుకు వారిద్దరూ దాచారు అనే విషయం తెలియాలంటే వారిద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.