ఎన్టీఆర్ కెరీర్‌లోని బిగ్గెస్ట్ మిస్టేక్ అదేనా?

ABN , Publish Date - Oct 19 , 2026 | 04:47 PM

పాన్ ఇండియా స్థాయిలో పోటీ పెరుగుతున్న తరుణంలో టాలీవుడ్ హీరోలు ఇతర భాషల మార్కెట్లపై దృష్టి పెడుతున్నారు. అల్లు అర్జున్ పుష్ప తర్వాత అట్లీ, లోకేష్ కనగరాజ్ వంటి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లతో జతకడుతూ తమిళ, హిందీ మార్కెట్లను కైవసం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.

NTR

పాన్ ఇండియా స్థాయిలో పోటీ పెరుగుతున్న తరుణంలో టాలీవుడ్ హీరోలు ఇతర భాషల మార్కెట్లపై దృష్టి పెడుతున్నారు. అల్లు అర్జున్ పుష్ప తర్వాత అట్లీ, లోకేష్ కనగరాజ్ వంటి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లతో జతకడుతూ తమిళ, హిందీ మార్కెట్లను కైవసం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం తెలుగు మార్కెట్‌కే పరిమితమవుతున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్టీఆర్ నటించిన దేవర హిందీ బెల్ట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోగా, హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన మోస్ట్ అవేటెడ్ మల్టీస్టారర్ వార్ 2 కూడా నిరాశపరిచింది. ఇలాంటి సమయంలో దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించగల సత్తా ఉన్న నెల్సన్ దిలీప్ కుమార్ లాంటి డైరెక్టర్ అవకాశాన్ని ఎన్టీఆర్ వదులుకోవడం నిజంగా పెద్ద పొరపాటేనని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.


జైలర్ విజయంతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నెల్సన్ దిలీప్‌కుమార్.. రజనీకాంత్‌తో తెరకెక్కించిన జైలర్ 2 ఈ వారమే థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ రాబడుతోంది. అయితే, జైలర్ తర్వాత నెల్సన్ నేరుగా ఎన్టీఆర్‌ను కలిసి ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథను వినిపించాడట. ఈ కథ ఎన్టీఆర్‌కు నచ్చినప్పటికీ, ఆయన దానిని హోల్డ్‌లో పెట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో గాడ్ ఆఫ్ వార్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఇక్కడే తారక్ పెద్ద పొరపాటు చేశాడు.


సాధారణంగా ఒక సినిమా హిట్ అయ్యింది అంటే.. ఆ డైరెక్టర్ ఎంత హీరోలు పడతారు. ఇక్కడ నెల్సన్.. ఎన్టీఆర్ కి కథ చెప్పినా, ఆయన రిజెక్ట్ చేయడం పొరపాటు. జైలర్ తరువాత నెల్సన్ కి వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. బీస్ట్ సినిమాతో నెగిటివిటీని మూటకట్టుకున్నా కూడా జైలర్ తో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చెరిపోయాడు నెల్సన్. ఆ సినిమా తరువాత కనుక ఎన్టీఆర్ సినిమా పడి ఉంటే.. అటు తమిళ్, ఇటు తెలుగులో తారక్ కి గట్టి ఎలివేషన్ ఉండేది. మార్కెట్ పెరిగేది. అలా కాకుండా ఈ ప్రాజెక్టుని రిజెక్ట్ చేసి పెద్ద తప్పే చేశాడని అంటున్నారు. ప్రస్తుతం తారక్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సెట్స్ మీద ఉండగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఏది ఏమైనా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు కొద్దిగా రిస్క్ అయినా కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటే మరింత ఎదిగే ఛాన్స్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Oct 19 , 2026 | 04:50 PM