సుమకి నితిన్ పంచ్.. నాకు హాగ్ ఇవ్వలేదు
ABN , Publish Date - Nov 29 , 2026 | 06:23 PM
అలియాస్ రుక్మిణీ ప్రీ రిలీజ్ వేడుకలో యాంకర్ సుమపై హీరో నితిన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దుల్కర్ సల్మాన్ ఇంటర్వ్యూకు వచ్చినప్పుడు సుమ ప్రత్యేకంగా ఆతిథ్యం ఇచ్చారని, తన విషయంలో అలా జరగలేదని నితిన్ సరదాగా ప్రస్తావించారు. దీనికి సుమ కూడా చమత్కారంగా స్పందించి నితిన్‌కు హగ్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇండస్ట్రీలో యాంకర్ సుమ (Suma) లేనిదే పెద్ద ఈవెంట్స్ లేవు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎలాంటి ఈవెంట్ అయినా.. ఇంటర్వ్యూ అయినా కూడా ఆమె ఉంటే వచ్చే ఎనర్జీ వేరు. కొంచెం ట్రైలర్ లేట్ అయినా.. సెలబ్రిటీలు రావడం ఆలస్యమైనా కూడా సుమ తన వాక్చాతుర్యంతో ఆ ఈవెంట్ ని తన భుజస్కందాల మీద మోసి హిట్ చేస్తుంది. అందుకే స్టార్ ఈవెంట్స్ కి ఆమెనే యాంకర్ గా ఉంటూ వస్తుంది. అందరినీ నవ్విస్తూ ఉండే సుమకి.. తాజాగా హీరో నితిన్ పంచ్ వేశాడు.
అసలేం జరిగింది అంటే.. నితిన్ హీరోగా నాని నిర్మిస్తోన్న చిత్రం అలియాస్ రుక్మిణీ. మురళీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 4 న రిలీజ్ కి సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించారు. ఈ వేడుకకి నాని, నితిన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఈ వేడుకలో నితిన్ మాట్లాడుతూ.. సుమ చేసిన ఒక పని గురించి చెప్పుకొచ్చాడు. సుమ.. తనను ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు.. ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి నాకు హాయ్ చెప్పింది. ఆ తరువాత నేను ఆమె ఇంటర్వ్యూల వీడియోలు చూశాను. దుల్కర్ సల్మాన్ వచ్చినప్పుడు మాత్రం కిందకి వచ్చి కారు దగ్గరే ఆయనకు హాగ్ ఇచ్చి, స్వీట్లు తినిపించి, వాళ్ళ అమ్మగారిని పిలిచి మరీ పరిచయం చేసి మాట్లాడింది. ఏంటి సుమా.. ఇది మీ అడ్డా.. మీరేమో మీ సొంత భాషవాళ్ళు రావడంతో అలా చేస్తారా.. ? అంటూ సరదాగా పంచ్ వేశాడు.
దానికి సుమ.. వెంటనే నితిన్ మాటలను ఈజీగా తీసుకొని.. కేరళలో మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. వారికి చూపించుకోవడానికి మాత్రమే అలా చేశాను. అప్పుడు ఇవ్వని హాగ్.. ఇప్పుడు ఇస్తున్నాను అని నితిన్ కి హాగ్ ఇచ్చి సెట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏంటి సుమ.. మా నితిన్ అన్నకి ఎందుకు హాగ్ ఇవ్వలేదు అని నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.