నాగచైతన్య-శోభిత గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా?
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:45 PM
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో ఒకరైన నాగ చైతన్య (Naga Chaitanya)-శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో ఒకరైన నాగ చైతన్య (Naga Chaitanya)-శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. నాగచైతన్య చేసిన ఓ సరదా పోస్ట్ దీనికి కారణమైంది. ఇటీవల నాగచైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో భార్య శోభిత ఫోటో పోస్ట్ చేశారు. ఆ ఫోటోకు, "పెళ్లైన తర్వాత తొలిసారి శోభిత నా కోసం డిన్నర్ వండింది. బహుశా ఈ రోజు నేను ఏదో మంచి పని చేసినట్టున్నాను" అంటూ సరదాగా క్యాప్షన్ జత చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఒక సెక్షన్ నెటిజన్స్ మాత్రం మరో చర్చ మొదలు పెట్టారు. ఫోటోలో శోభిత కనిపించిన తీరు చూసి కొందరు నెటిజన్లు ఆమె ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చని ఊహాగానాలు మొదలుపెట్టారు. బేబీ బంప్ కనిపిస్తోందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు.
దీంతో 'చైతూ-శోభిత త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా?' అంటూ అనే ప్రశ్న నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నాగచైతన్య గానీ, శోభిత ధూళిపాళ్ల నుంసీజీ ఎలాంటి స్పందన లేదు. ప్రస్తుతం నాగ చైతన్య దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'వృషకర్మ'తో బిజీగా ఉన్నారు. ఇందులో చైతూకు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా, జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ్, సత్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.