మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో విక్రమ్ తనయుడు..
ABN , Publish Date - Apr 06 , 2026 | 03:02 PM
చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram) తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.
చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram) తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటి దాకా తమిళంలో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వెళ్తున్న ఆయన త్వరలో తెలుగు తెరపై కనిపించనున్నారు. ఇప్పటికే పలువురు తెలుగు దర్శకులు ఆయనకు కథలు వినిపించినప్పటికీ ఏదీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆయన్ను తెలుగులో లాంచ్ చేయడానికి సన్నాహాల్లో ఉంది.
ద్విభాషా చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. దీనికి కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ధ్రువ్‌కి ఇది నాలుగో సినిమా. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నారని తెలిసింది. సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. త్వరలో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.