ఇదే కాంబినేషన్‌లో.. వచ్చే ఏడాది మరో చిత్రంతో వస్తాం
ABN , Publish Date - Feb 16 , 2026 | 06:28 AM
'కపుల్ ఫ్రెండ్లీ కాంబినేషన్‌లోనే వచ్చే ఏడాది ప్రేమికుల రోజున మరో చక్కని చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తాం’ అని ధీరజ్ మొగిలినేని అన్నారు.
‘యువతను, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మా ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly) చిత్రం నూటికి నూరు శాతం విజయం సాధించింది. థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు చూడాలనే నా కల ఈ సినిమాతో నెరవేరింది’ అని సంతోష్ శోభన్ (Santosh Soban) అన్నారు. ఆయన హీరోగా అశ్విన్ చంద్రశేఖర్ (Ashwin Chandrasekar) దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సినిమా పంపిణీదారుడు ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni) మాట్లాడుతూ ‘ఇదే కాంబినేషన్‌లో వచ్చే ఏడాది ప్రేమికుల రోజున మరో చక్కని చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తాం’ అని చెప్పారు.
కేవలం టాక్‌తోనే కాకుండా, వసూళ్ల పరంగానూ ‘కపుల్ ఫ్రెండ్లీ’ సత్తా చాటుతోందని దర్శకుడు అన్నారు. మేము కోరుకున్న కథ, కావాలనుకున్న విజయం ఈ సినిమాతో దక్కాయి అన్నారు., మీ ఎనర్జీ చూస్తేంటే నాకు పిచ్చెక్కుతుంది అని కథానాయిక మానస వారణాసి (Manasa Varanasi) ఆనందం వ్యక్తం చేశారు.