Shabara: మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న దీక్షిత్.. శబార టీజర్ అదిరింది
ABN , Publish Date - Jan 29 , 2026 | 06:13 AM
ఇటీవల.. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న దీక్షిత్ మరోమారు కొత్త కాన్పెస్ట్‌తో ప్రేక్షకుల ఎదుటకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.
దీక్షిత్ శెట్టి (Dheekshithh Shetty), మిషా నారంగ్ (Misha Narang), కృతిక సింగ్ యాదవ్ (RITIKA SINGH YADAV) ప్రధాన పాత్రల్లో ప్రేమ్‌చంద్ కిలారు (KILARU PREM CHAND) తెరకెక్కిస్తున్న చిత్రం ‘శబార’ (Shabara). హర్షిత చదలవాడ, దుర్గా చంచు, రమాదేవి కిలారు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ పేరుతో మేకర్స్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ ‘శబార’ అంటే ప్రపంచం. ప్రేమ్‌చంద్ సృష్టించిన ప్రపంచం. అడవిలోనే కథ మొత్తం సాగుతుంది’ అని చెప్పారు. ‘నేను ఇప్పుడేం మాట్లాడను. ఈ సినిమానే అంతా మాట్లాడుతుంది’ అని ప్రేమ్‌చంద్ తెలిపారు.
అయితే బుధవారం రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ ఆసక్తికరంగా ఉండి సినిమాపై క్యూరియాసిటీ పెంచేదిగా ఉంది. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న దీక్షిత్ మరోమారు కొత్త కాన్పెస్ట్‌తో ప్రేక్షకుల ఎదుటకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.