'ఢీ' విజేత రాజు అరెస్ట్.. పెళ్లి పేరుతో ఘోర మోసం!

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:00 PM

ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ 10' విజేతగా నిలిచి బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ రాజు తీవ్రమైన లైంగిక ఆరోపణలతో అరెస్టయ్యాడు.

Dhee Raju

ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ 10' విజేతగా నిలిచి బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ రాజు (Raju) తీవ్రమైన లైంగిక ఆరోపణలతో అరెస్టయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లుగా తనను శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని మోసం చేశాడంటూ ఒక యువతి చేసిన ఫిర్యాదు ఆధారంగా మియాపూర్ పోలీసులు రాజును అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.


పోలీసుల కథనం ప్రకారం, మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌లో బోటిక్ నడుపుతున్న బాధితురాలికి, అదే భవనంలో ఉన్న చిట్టి డాన్స్ స్టూడియోకు ప్రాక్టీస్ కోసం వచ్చే రాజుతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాకుండా, అత్యవసర ఆర్థిక సమస్యల పేరుతో బాధితురాలి నుంచి పలు దఫాలుగా దాదాపు రూ. 12 లక్షల వరకు నగదు మరియు ఆన్‌లైన్ ద్వారా తీసుకున్నాడు.


పదేళ్ల సాన్నిహిత్యం తర్వాత బాధితురాలు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేగా, చెల్లెలి పెళ్లి కారణం చెబుతూ వాయిదా వేస్తూ వచ్చాడు. చివరికి పెళ్లికి నిరాకరించడమే కాకుండా, ఆమె ఇచ్చిన డబ్బుతో ఇతర మహిళలతో తిరుగుతూ మోసానికి పాల్పడ్డాడని బాధితురాలు మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. యువతి సమర్పించిన ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఈ నెల 9న రాజుపై BNS సెక్షన్ 69, 318(4) కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణ అనంతరం నిందితుడు రాజును అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఇక ఈ విషయం తెలియడంతో నెటిజన్స్ షాక్ కి గురవురతున్నారు. ఢీ విన్నర్ అయ్యాక రాజుని వెండితెరపై చూస్తామని అనుకుంటే.. ఇలాంటి పనులు చేసి కెరీర్ ని పోగొట్టుకున్నాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Sep 12 , 2026 | 05:00 PM