'దేవర' కథ చెప్పబోతున్న ఈటీవీ..

ABN , Publish Date - May 26 , 2026 | 08:01 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా దేవర (Devara). ఈ సినిమా వచ్చి ఏడాదిన్నర అవుతోంది.

Devara

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా దేవర (Devara). ఈ సినిమా వచ్చి ఏడాదిన్నర అవుతోంది. కానీ, ఇప్పటివరకు శాటిలైట్ హక్కులను ఏ ఛానెల్ కూడా సొంతం చేసుకోలేదు. థియేటర్, ఓటీటీ కాకుండా చాలామంది దేవర టీవీలో ఎప్పుడు ప్రసారం అవుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ ఎదురుచూపులకు తెరపడింది.


బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన దేవర.. ఇప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దేవర సినిమా తెలుగు శాటిలైట్ హక్కులను ఈటీవీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అసలు ఇప్పటివరకు ఏ ఛానెల్ ఎందుకు తీసుకోలేదు అంటే నిర్మాత అయిన కళ్యాణ్ రామ్ .. భారీ ధరకు దేవర శాటిలైట్ హక్కులను అమ్మాలని, ఒక ఫ్యాన్సీ రేటుకోసం ఎదురుచూస్తున్నాడని టాక్. ఇక ఇప్పుడు ఈటీవీ సైతం దేవర హక్కులను భారీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సినిమాకు ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా ఈటీవీ యాజమాన్యం పోటీపడి మరీ ఈ హక్కులను సొంతం చేసుకుందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.


సాధారణంగా ఎన్టీఆర్ సినిమాలకు బుల్లితెరపై ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ ఉంటుంది. అందులోనూ దేవర లాంటి భారీ కమర్షియల్, ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం టెలివిజన్ రంగంలో గట్టి పోటీ నెలకొంది. చివరికి ఈటీవీ ఆ ఛాన్స్ పట్టేసింది. అది కాకుండా ఎన్టీఆర్ కి, ఈటీవీ కి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఎన్టీఆర్ ని హీరోగా పరిచయం చేసింది రామోజీరావునే. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సింహాద్రి ఇప్పటికీ ఈటీవీ లో తప్ప ఇంకెక్కడా చూడలేం. అల్లరి రాముడు సైతం వారి దగ్గరే ఉంది. ఇక ఇప్పుడు వీటికి తోడు దేవర కూడా చేరింది. త్వరలోనే పండగ కానుకగా ఈ సినిమాను బుల్లితెరపై గ్రాండ్‌గా ప్రీమియర్ చేయడానికి ఈటీవీ ప్లాన్ చేస్తోందని టాక్. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Updated Date - May 26 , 2026 | 08:11 PM