ఆ 134 సినిమాల పాటలను.. ఇళయరాజా వినియోగించరాదు 

ABN , Publish Date - Feb 17 , 2026 | 03:25 PM

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) న్యాయపరమైన వివాదంలో నిలిచారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) న్యాయపరమైన వివాదంలో నిలిచారు. సరిగమ (Saregama) ఆడియో సంస్థతో కొనసాగుతున్న హక్కుల వివాదంపై కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేయడంతో ఈ అంశం సినీ, సంగీత వర్గాల్లో చర్చకు దారి తీసింది. తుది తీర్పు వెలువడే వరకు 134 సినిమాలకు చెందిన పాటలను ఇళయరాజా వినియోగించరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

గత సంవత్సరం 'అగత్యా' సినిమాలోని ఓ పాట విషయంలో  ఇళయరాజా–సరిగమ మధ్య విభేదాలు బయటపడ్డాయి. అప్పటి నుంచి ఈ వివాదం మరింత వేడెక్కింది.  1976 నుంచి 2001 సమయంలో ఇళయరాజా సంగీతం అందించిన 134 చిత్రాల ఆడియో హక్కులు ఆయా నిర్మాతలు సరిగమ ఆడియో సంస్థకు శాశ్వతంగా విక్రయించారు. వాటిని ఇళయరాజా ఉపయోగించుకోవచ్చు.

కానీ ఆయన ఆ పాటలను డిజిటల్ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌లకు ఉపయోగించుకునేలా అనుమతులు ఇచ్చారు. ఆ ఆరోపణలతో సరిగమ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఢిల్లీ హై కోర్ట్  నిర్మాతల నుంచి కొనుగోలు చేసిన తర్వాత ఆ పాటలపై పూర్తి హక్కులు సరిగమకే ఉంటాయని స్పష్టం చేసింది. సంస్థ అనుమతి లేకుండా ఆ పాటలను ఉపయోగించడం సరికాదని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.   

Updated Date - Feb 17 , 2026 | 03:58 PM