పిచ్చి పిల్ల కోసం దిల్‌లో విల్లా కట్టేస్తాం..
ABN , Publish Date - Feb 13 , 2026 | 05:42 PM
'శుభం' సినిమాతో విజయాన్ని అందుకు హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'దీవాన'. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు.
'శుభం' (Subham) సినిమాతో విజయాన్ని అందుకున్న హర్షిత్ రెడ్డి (Harshith Reddy) హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'దీవాన' (Deewana) . అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ సంగిశెట్టి (Srikanth Sangisetti) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా స్టోరీ పోస్టర్, వీడియో రిలీజ్ చేశారు. డీప్ లవ్ లో ఉన్న హీరో తన ప్రేమ గురించి, ప్రేయసి గురించి చెప్పే అంశాలతో ఈ వీడియో సాగింది.
'లవ్ అనేది కావాలని ఎవడు చేయడు, అది ఐపోతది అంతే, ఒక పిచ్చి పిల్ల కోసం దిల్ లో విల్లా కట్టేస్తాం, ఆ ఒక్క పిల్ల వల్ల జీవితం ఉల్టా పల్టా ఐపోతున్నా గాల్లో తేలుతుంటం, ప్రాణం పెట్టేస్తాం, జాన్ ఇచ్చేస్తం, ఆ వైబే వేరుంటది లే, లవ్ లైట్ గా ఉన్నంత వరకే బ్రో ఎవడైనా లవర్ బాయ్, అదే లవ్ దిల్ మొత్తం నిండిపోతే అప్పుడు తయారైతడు ఒక దివానా, ప్యార్ ఒక కిర్రాక్ నషారా బై, సస్తున్నా మస్తు ఉంటది..' అంటూ హీరో తన లవ్ ఫీల్ ను చెప్పడం ఆకట్టుకుంది. హర్షిత్ రెడ్డి ఈ వీడియోలో కొత్తగా కనిపిస్తున్నారు. ఆయన నటన ఇంప్రెస్సివ్ గా ఉంది.