Deepika Padukone: మెటర్నిటీ బ్రేక్‌కు ముందే ‘రాకా’ షూటింగ్‌ పూర్తి చేసేలా..  

ABN , Publish Date - Jul 17 , 2026 | 05:04 PM

అల్లు అర్జున్‌ (Allu arjun) హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాకా’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


అల్లు అర్జున్‌ (Allu arjun) హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాకా’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె (Deepika padukone) కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం నెట్టింట వైరల్‌ అవుతోంది. దీపిక రెండో సారి గర్భవతి అయిన సంగతి తెలిసిందే! కొన్ని నెలల్లో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న దీపికా.. మెటర్నిటీ బ్రేక్‌ ప్రారంభమయ్యేలోపు ‘రాకా’కు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆ దిశగానే ఆమె ఈ సినిమాకు పని చేస్తోందట. దీపికా వ్యక్తిగత జీవితానికి ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో.. వ్యత్తి జీవితానికి అంతే ప్రాధాన్యమిస్తారు.

ఇప్పుడు అటు సినిమా, ఇటు పర్సనల్‌ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. షూటింగ్‌లో బిజీగా ఉంటూనే తన మొదటి కుమార్తె దువా సంరక్షణను కూడా చూసుకుంటున్నారు. ఆమె డెడికేషన్‌ చూసిన అభిమానులు, నెటిజన్లు  ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.  గతంలో బాలీవుడ్‌లో ‘ఎనిమిది గంటల పని’ విధానంపై తన అభిప్రాయం వ్యక్తం చేసిన దీపికా ఈ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి ప్రత్యేక నిబంధనలు పెట్టుకుండా చిత్రీకరణ పూర్తయ్యేలా పూర్తి సహకారం అందించినట్లు తెలుస్తోంది. ‘రాకా’ సినిమా అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతుంది.



 

Updated Date - Jul 17 , 2026 | 05:05 PM