దీపికా షాకింగ్ డెసిషన్.. అర్దరాత్రి వరకు ఆ సెట్ లోనే
ABN , Publish Date - Aug 10 , 2026 | 05:55 PM
బాలీవుడ్ స్టార్ నటి, లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకొణే వర్క్ కమిట్‌మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పాత్ర చేసినా, ఏ ప్రాజెక్ట్‌ను ఒప్పుకున్నా తన వంద శాతం శ్రమను అందించే దీపికా.. తాజాగా మరోసారి తన డెడికేషన్‌తో సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
బాలీవుడ్ స్టార్ నటి, లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకొణే (Deepika Padukone) వర్క్ కమిట్‌మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పాత్ర చేసినా, ఏ ప్రాజెక్ట్‌ను ఒప్పుకున్నా తన వంద శాతం శ్రమను అందించే దీపికా.. తాజాగా మరోసారి తన డెడికేషన్‌తో సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఎనిమిది నెలల నిండు గర్భవతిగా ఉన్న ఆమె, త్వరలోనే అంటే సెప్టెంబర్‌లో తన రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెల్సిందే. అయితే ప్రసవ సమయం దగ్గరపడుతున్నా కూడా ఆమె విశ్రాంతి తీసుకోకుండా సెట్స్‌లోనే ఉండటం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రాకా కోసం ప్రెగ్నెన్సీలో కూడా రిస్క్ తీసుకొంటుందట దీపికా.
ప్రస్తుతం దీపికా నటిస్తోన్న భారీ ప్రాజెక్ట్ రాకా. అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక రాకా షూటింగ్‌ను డెలివరీకి ముందే పూర్తి చేయాలనే పట్టుదలతో దీపికా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె సెట్స్‌లోనే సమయం గడుపుతూ, అవసరమైనప్పుడు అర్థరాత్రి వరకు కూడా షూటింగ్‌లో పాల్గొంటుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్.
ప్రసవానికి కొద్దిరోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ, సినిమా షెడ్యూల్స్ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ఆమె చూపుతున్న ఈ అంకితభావం చూసి చిత్ర యూనిట్, సాంకేతిక నిపుణులు అవాక్కవుతున్నారట. ఆమె ప్రొఫెషనలిజం, సినిమా పట్ల ఉన్న ప్రేమాభిమానాలను చూసి యూనిట్ సభ్యులంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారని సమాచారం. తన పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్‌ను సమానంగా బ్యాలెన్స్ చేస్తూ నటిస్తున్న దీపికా పదుకొణేను చూసి అభిమానులు ది రియల్ క్వీన్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరి ఈ సినిమాతో దీపికా ఎలాంటి విజయాన్ని అందుకుటుందో చూడాలి.