Sreeleela: రేయ్ దారుణంరా.. బంగారం లాంటి పిల్లరా

ABN , Publish Date - Nov 10 , 2026 | 06:42 PM

గత కొంతకాలంగా ఏఐ టెక్నాలజీని చాలామంది దుర్వినియోగం చేస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లను ఏఐ అస్సలు వదలడం లేదు. చట్టపరమైన చర్యలు తీసుకున్నా కూడా వారి ఫోటోలను మార్ఫింగ్ చేయడం కొందరు ఆకతాయిలు మానడం లేదు.

Sreeleela

గత కొంతకాలంగా ఏఐ టెక్నాలజీని చాలామంది దుర్వినియోగం చేస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లను ఏఐ అస్సలు వదలడం లేదు. చట్టపరమైన చర్యలు తీసుకున్నా కూడా వారి ఫోటోలను మార్ఫింగ్ చేయడం కొందరు ఆకతాయిలు మానడం లేదు. ఇష్టం వచ్చినట్లు హీరోయిన్ల ఫేస్ లను వేరేవేరే బాడీస్ కి మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులు ఎలా ఉంటున్నాయి అంటే అసలు నిజంగా హీరోయిన్లు చూసినా కూడా అందులో ఉన్నది నేను కాదు అన్నా ఎవరు నమ్మరు. అంతలా ఏఐ ని వాడుతున్నారు. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లు డీప్ ఫేక్ బారిన పడ్డారు. తాజాగా ఆ లిస్ట్ లో కుర్ర హీరోయిన్ శ్రీలీల (Sreeleela) కూడా చేరింది.


అందం, అమాయకత్వం కలిసిన ఈ కుందనపు బొమ్మ ఒకప్పుడు టాలీవుడ్ ని షేక్ చేసి.. ఇప్పుడు కోలీవుడ్ లో తన సత్తా చాటాడానికి సిద్ధమయ్యింది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అమ్మడు అవకాశాలు పట్టేసింది. రజనీకాంత్ ధర్మన్, ధనుష్ ఓమ్, అజిత్ కుమార్ డేర్ డెవిల్ లో శ్రీలీలనే హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేస్తుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా శ్రీలీల డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మునుపెన్నడూ చూడని రీతిలో అమ్మడు కనిపించింది. రెడ్ కలర్ డిజైనర్ డ్రెస్ లోప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ఎద అందాలను కవర్ చేయకుండా.. బ్యాక్ లెస్ డ్రెస్ లో శ్రీలీలని చూడగానే ఫ్యాన్స్ అవాక్కయ్యారు. ఏంటి.. శ్రీలీల ఇది ఇలాంటి బట్టల్లో నువ్వా.. అంటూ మండిపడ్డారు.


అయితే, ఈ వీడియోలో ఉన్నది శ్రీలీల కాదని, అది డీప్ ఫేక్ వీడియో అని తెలియడంతో ఫ్యాన్స్ చల్లబడ్డారు. ఒక బాలీవుడ్ నటి వేసుకున్న డ్రెస్ ని కలర్ మార్చి.. శ్రీలీల ఫేస్ పెట్టి చేసిన డీప్ ఫేక్ అని ఫ్యాన్స్ కనిపెట్టేశారు. దీంతో ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేసేవారిని అస్సలు వదలొద్దని సైబర్ పోలీసులను ట్యాగ్ చేస్తున్నారు. ఈ వీడియో మరింతగా వ్యాప్తి చెందకముందే వెంటనే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించాలని, ఇలాంటి కంటెంట్‌ను షేర్ చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. రేయ్ దారుణంరా.. బంగారం లాంటి పిల్లరా.. ఆమె కెరీర్ ని నాశనం చేయకండి అంటూ నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ డీప్ ఫేక్ పై శ్రీలీల ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.

Updated Date - Nov 10 , 2026 | 06:45 PM