డార్లింగ్ లుక్ అదిరింది.. 'కపుల్ ఫ్రెండ్లీ' టీంతో ప్రభాస్ సరదా సంభాషణ
ABN , Publish Date - Feb 20 , 2026 | 06:53 AM
సంతోష్ శోభన్ హీరోగా మానస వారణాసి కథానాయికగా ఇటీవల థియేటర్లకు వచ్చి విజయవంతంగా రన్ అవుతున్న చిత్రం 'కపుల్ ఫ్రెండ్లీ'.
సంతోష్ శోభన్ (Santosh Soban) హీరోగా మానస వారణాసి (Manasa Varanasi) కథానాయికగా ఇటీవల థియేటర్లకు వచ్చి విజయవంతంగా రన్ అవుతున్న చిత్రం 'కపుల్ ఫ్రెండ్లీ' (Couple Friendly). విడుదలైన తొలి రోజు నుంచే సర్వత్రా పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబడుతోంది. అయితే సినిమా రిలీజ్‌కు ముందే ప్రచార వ్యవహారాల్లో దూకుడు ప్రదర్శించిన ఈ చిత్ర యూనిట్‌కు అనూహ్యంగా సినిమా విడుదల అనంతరం అంతకుమించి అనే రీతిలో పబ్లిసిటీ లభిస్తోంది. సినిమా చూసిన చాలామంది ఆకాశానికి ఎత్తేస్తుంటే తాజాగా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) నుంచి సపోర్ట్ లభిండంతో చిత్ర యూనిట్ ఉబ్బితబ్బిబవుతోంది.
ఇప్పటికే ఈ కఫుల్ ఫ్రెండ్లీ సినిమా చూసిన ప్రభాస్ తాజాగా హీరో హీరోయిన్లు సంతోష్ శోభన్, మానస, దర్శకుడు అశ్విన్ (Ashwin) తో జరిగిన ఇంటర్వ్యూలో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమా గురించి ఫన్నీగా డిస్కస్ చేశారు. సినిమా విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో మానస విజయవాడ పునుగులు ఆపై లవ్ గురించి అడగడంతో ఈ క్వశ్చన్ పర్సనల్‌గా అడిగావు కదా అని జోక్స్ వేస్తూ ఇంటర్వ్యూ సాగింది. అయితే.. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫుల్ వీడియో ఈ రోజు విడుదల కానుంది.
కాగా ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ప్రభాస్ లుక్‌ను, వదిలిన పంచులను చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రభాస్ చాలా కాలం తర్వాత రిలాక్స్ మోడ్‌లో, కొత్త లుక్‌లో కనబడడం అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది. ఇక.. ప్రభాస్ కొత్త లుక్ సూపర్‌గా ఉందని ఇది ఫౌజీ కోసమేనని అభిప్రాయ పడుతున్నారు. ప్రభాస్ లేటెస్ట్‌గా తన హెయిర్ స్టైల్, గడ్డం, ట్రెండీ డ్రెస్సింగ్‌లో అల్ట్రా స్టైలిష్ లుక్ తో కనిపించడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.