Fauji: డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. టీజర్ వచ్చేస్తోంది! ఎప్పుడంటే?
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:57 PM
ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ఫౌజీ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటి ఫౌజీ (Fauji). క్లాసిక్ లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ చిత్రాన్ని అద్భుతమైన పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటన వచ్చినప్పటి నుండి అటు అభిమానుల్లో, ఇటు సాధారణ ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఓ క్రేజీ అప్‌డేట్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోంది.
ఈ ఏడాది డిసెంబర్ 3న 'ఫౌజీ' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిసిందే. ఆ సందర్భంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను ఏ రేంజ్‌లో ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యుద్ధభూమిలో ప్రభాస్ కనిపించిన తీరు, ఆ ఇంటెన్స్ లుక్స్ చూసి డార్లింగ్ ఫ్యాన్స్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. హను రాఘవపూడి ఈ చిత్రాన్ని ఎంతటి విజన్‌తో తీస్తున్నారో ఆ పోస్టర్‌తోనే క్లారిటీ వచ్చేసింది. అప్పటి నుండి ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి చిన్న లీక్, ప్రతి అప్‌డేట్ కోసం అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఇప్పుడు అసలు సిసలైన ఓ బిగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న 'ఫౌజీ' మాసివ్ టీజర్‌ను విడుదల చేయడానికి చిత్ర బృందం వేగంగా సన్నాహాలు చేస్తోందట. ఈ టీజర్ కట్ చాలా అద్భుతంగా, మైండ్ బ్లోయింగ్‌గా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. ఆగస్టు 15 టీజర్‌తో బోణీ కొట్టి, అక్కడి నుంచి సినిమా విడుదల వరకు వరుసగా ఊహించని అప్‌డేట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేయాలని మేకర్స్ పక్కా ప్లాన్ వేస్తున్నారని తెలుస్తోంది.
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వీ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, కథలో చాలా కీలకమైన మలుపులు తిప్పేలా ఉంటుందని సమాచారం. ఇక సినిమా షూటింగ్ ఎక్కువ భాగం పూర్తయి, దాదాపు చివరి దశకు చేరుకుంది. మిగిలి ఉన్న చిత్రీకరణను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి చిత్ర బృందం రాత్రింబవళ్లు కసరత్తు చేస్తోంది.
ఈ సినిమాతో పాటు ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమా షూటింగ్‌లోనూ బిజీగా ఉన్నారు. ఆ షెడ్యూల్ పూర్తి కాగానే, త్వరలోనే ఫౌజీ సెట్స్‌లోకి అడుగుపెట్టి మిగిలిన భాగాన్ని పూర్తి చేయనున్నారట. మరి ఆగస్టు 15న రాబోతున్న 'ఫౌజీ' టీజర్ సినిమాపై ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.