శారీరకంగా వాడుకొని మోసం చేశాడు.. ఈశ్వర్ సాయిపై మాధురి కేసు

ABN , Publish Date - Sep 01 , 2026 | 03:40 PM

ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయిపై తోటి డ్యాన్సర్ మాధురి రాథోడ్ కేసు పెట్టడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గత కొన్నిరోజుల క్రితం ఈశ్వర్ సాయి - మాధురి రాథోడ్ ఒకే రూమ్ లో ఉండడంతో ఈశ్వర్ సాయి భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మాధురిపై చేయి చేసుకున్న విషయం తెల్సిందే.

Madhuri Rathod

ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి (eshwar Sai )పై తోటి డ్యాన్సర్ మాధురి రాథోడ్ కేసు పెట్టడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గత కొన్నిరోజుల క్రితం ఈశ్వర్ సాయి - మాధురి రాథోడ్ (Madhuri Rathod) ఒకే రూమ్ లో ఉండడంతో ఈశ్వర్ సాయి భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మాధురిపై చేయి చేసుకున్న విషయం తెల్సిందే. ఆ తరువాత మాధురి.. ఈ విషయం గురించి పట్టించుకోకుండా రీల్స్ చేస్తూ వచ్చింది. ఇక ఈశ్వర్ సాయి.. ఏదో ఉద్రేకంలో జరిగిందని ఒకసారి చెప్పి.. ఇంకోసారి కేవలం వాష్ రూమ్ ఉపయోగించుకోవడానికి మాత్రమే మాధురి రూమ్ కి వెళ్ళినట్లు తెలిపాడు.


ఇక తాజాగా హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈశ్వర్ సాయిపై తోటి డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకొని మోసం చేయడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి తన పరువుకు భంగం కలిగించాడని మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించింది.


బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. తన ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత వీడియోలు, ఫోటోలను సేకరించిన ఈశ్వర్ సాయి, వాటితో ఏఐ ద్వారా నకిలీ వీడియోలను సృష్టించాడని ఆరోపించింది. తనకు ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధాలు ఉన్నట్లుగా ఆ వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తూ తన పరువు తీశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై 69 BNS చట్టంతో పాటు పలు సంబంధిత విభాగాల కింద కేసు నమోదు చేశారు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పరారీలో ఉన్న నిందితుడు ఈశ్వర్ సాయిని అదుపులోకి తీసుకోవడానికి నార్సింగి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తీవ్రంగా గాలిస్తున్నారు. ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ మహిళల పరువుకు భంగం కలిగించే చర్యలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని అధికారులు తెలిపారు.

Updated Date - Sep 01 , 2026 | 03:49 PM