నేను చూసిన అద్భుతమైన సినిమాల్లో 'డెకాయిట్' ఒకటి

ABN , Publish Date - Apr 13 , 2026 | 09:59 AM

అడివి శేష్ డెకాయిట్ చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతంగా దూసుకు పోతోంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు.

Allu Aravind

అడివి శేష్ (Adivi Sesh), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా షానీల్ డియో దర్శకత్వం వహించిన చిత్రం డెకాయిట్ (Dacoit). అన్నపూర్ణ స్టూడి యోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ (Allu Aravind) మాట్లాడుతూ.. 'నేను చూసిన అద్భుతమైన సినిమాల్లో డెకాయిట్ కూడా ఒకటి. మృణాల్ సరస్వతి పాత్రలో కనబరిచిన నటన ప్రత్యేక ఆక ర్షణగా నిలిచింది. అందరూ బ్రహ్మాండంగా చేశారు. టీమ్ వ‌ర్క్‌కు ఈ చిత్రం ఓ మంచి ఉదాహరణ' అని అన్నారు. మృణాల్ గురించి అరవింద్ మాట్లాడుతూ.. 'గ‌తంలో లావ‌ణ్యను దీవించాను ఆ త‌ర్వాత వ‌రుణ్‌ను పెళ్లి చేసుకుని ఇక్క‌డే ఉండిపోయింది. ఇప్పుడు మృణాల్ కూడా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుని ఇక్క‌డే ఉంటుంద‌ని అనుకుంటున్నాను' అని ఈవెంట్‌లో న‌వ్వులు పూయించారు.

దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ 'డెకాయిట్ సినిమాను చూసి ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతున్నారు. అడివి శేష్ చేసే చిత్రాలనుంచి చాలా నేర్చుకోవచ్చు. ఈ చిత్రం సమ్మర్ బ్లాక్ బ‌స్టర్‌గా ఘనవిజయం సాధించినందుకు ఆనందంగా ఉంది' అని చెప్పారు. 'నా కెరీర్లోనే ఎక్కువ ఓపెనింగ్స్ సాధించిన చిత్రమిది. ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు' అని అడివి శేష్ పేర్కొన్నారు.

సుప్రియా యార్లగడ్డ (Supriya) మాట్లాడుతూ 'డెకాయిట్ ప్రేమతో చేసిన సినిమా. ఇది స్వచ్ఛమైన ప్రేమకు ఓ ఎక్స్ప్రెషన్. ఈ చిత్రం ప్రేక్షకుల మనసును తాకినందుకు చాలా ఆనందంగా ఉంది' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బన్నీ వాసు, స్వప్న దత్, దర్శకురాలు నందినీ రెడ్డి, కథానాయకుడు రోషన్ మేక తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2026 | 10:11 AM