బాలయ్య - గోపీచంద్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్!

ABN , Publish Date - Apr 06 , 2026 | 08:55 PM

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరూ మళ్ళీ జతకడుతుండటంతో, ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, చిత్ర బృందం సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. ఈ చిత్రంలో బాలయ్య బాబు ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపిస్తారని వస్తున్న వార్తలు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న సరికొత్త వార్త ఏమిటంటే, ఏప్రిల్ మూడవ వారం నుంచి ఒక భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ జరగనుంది. ప్రధానంగా బాలయ్య బాబుపై ఒక గ్రాండ్ సాంగ్‌ను అక్కడ చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. కేవలం పాట మాత్రమే కాకుండా, కథలో కీలకమైన ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా అదే షెడ్యూల్‌లో పూర్తి చేయాలని గోపీచంద్ మలినేని నిర్ణయించుకున్నారు.

గ్యాంగ్ స్టార్ షేడ్స్ ఉన్న పాత్ర కావడంతో ఈ యాక్షన్ సీన్లు వెండితెరపై ఊహించని రీతిలో ఉండబోతున్నాయట. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా నయనతార మహారాణి పాత్రలో కనిపించనున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ అనగానే అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన 'సింహా', 'శ్రీరామరాజ్యం', 'జై సింహా' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే ఇందుకు కారణం. ఒకవైపు బాలయ్య గ్యాంగ్ స్టార్‌గా మాస్ ఎలివేషన్స్ ఇస్తుంటే, మరోవైపు నయనతార రాయల్ లుక్ ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

నిర్మాణ విలువల పరంగా కూడా ఈ సినిమా ఎక్కడా తగ్గకుండా రూపొందుతోంది. సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా గోపీచంద్ మలినేని ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

గోపీచంద్ మలినేని, బాలయ్య, థమన్లది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ కావడంతో పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమా గురించి వస్తున్న వరుస అప్డేట్స్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద మరోసారి బాలయ్య ప్రభంజనం ఖాయమని అర్థమవుతోంది. అసలు ఈ పీరియాడిక్ కథాంశంలో గ్యాంగ్ స్టార్ పాత్ర ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Updated Date - Apr 06 , 2026 | 09:50 PM