Thella Kaagitham: లోతైన భావోద్వేగాల ‘తెల్లకాగితం'

ABN , Publish Date - Jun 07 , 2026 | 09:01 AM

'కోర్ట్' ఫేమ్ హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'తెల్లకాగితం' ఫస్ట్ లుక్ విడుదలైంది.

Thella Kaagitham

కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్ (Harsh Roshan), నక్షత్ర (Nakshatra) జంటగా రమేశ్ బండ్రెడ్డి (Ramesh Bandreddi) తెరకెక్కిస్తున్న చిత్రం తెల్లకాగితం (Thella Kaagitham). అరుణాచల క్రియేషన్స్ బ్యానర్పై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు.

Thella Kaagitham

లోతైన భావో ద్వేగాలతో సాగే అందమైన ప్రేమకథగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని చెప్పారు. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులనూ అలరిస్తుందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్:కేవీ గుహన్, సంగీతం: విజయ్ బుల్గానిన్.

Updated Date - Jun 07 , 2026 | 09:01 AM