10 రోజుల్లో 'కపుల్ ఫ్రెండ్లీ' కలెక్షన్స్ ఎంతో తెలుసా..
ABN , Publish Date - Feb 24 , 2026 | 06:39 PM
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' విజయవంతంగా నడుస్తోంది.
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' విజయవంతంగా నడుస్తోంది. 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.12.67 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. ప్రస్తుతం రెండో వారం కూడా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణ సొంతం చేసుకుంటోంది. సెకండ్ వీక్ రన్ పూర్తయ్యే సరికి బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్ ను 'కపుల్ ఫ్రెండ్లీ' క్రియేట్ చేయబోతోందని మేకర్స్ చెబుతున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించింది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేశారు.