ఎన్టీఆర్.. అనిల్ ముందా.. త్రివిక్రమ్ ముందా
ABN , Publish Date - Nov 14 , 2026 | 08:27 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ( NTR) ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు పాన్-ఇండియా స్థాయిలో వరుస భారీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే తారక్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. తాజాగా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తున్నాడు అని అధికారిక ప్రకటన రావడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ( NTR) ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు పాన్-ఇండియా స్థాయిలో వరుస భారీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే తారక్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. తాజాగా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తున్నాడు అని అధికారిక ప్రకటన రావడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి దిల్ రాజు కూడా ఒక నిర్మాతగా వ్యవహరించబోతున్నారని కూడా టాక్ నడుస్తోంది. ఇక ఈ చిత్రం సంక్రాంతి 2028 కానుకగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ అనౌన్స్‌మెంట్‌తో ఇప్పుడు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర చర్చ మొదలైంది.. అదే ఎన్టీఆర్ లైనప్‌లో ముందు పట్టాలెక్కేది త్రివిక్రమ్ సినిమానా? లేక అనిల్ రావిపూడి సినిమానా? అనే చర్చ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
ఎందుకంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ భారీ మైథలాజికల్ చిత్రం గాడ్ ఆఫ్ వార్ ని ప్రకటించిన విషయం తెల్సిందే. అరవింద సమేత వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు డ్రాగన్ షూట్ అవుతుందా.. ? గాడ్ ఆఫ్ వార్ సెట్ లో తారక్ ఎప్పుడు అడుగుపెడతాడా.. ? అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ నేపధ్యంలోనే అసలు గాడ్ ఆఫ్ వార్ ఉంటుందా .. ఆగిపోయిందా.. సడెన్ గా తారక్, అనిల్ తో సినిమా ప్రకటించడమేంటి అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. అలా అనుకోవడానికి కారణం కూడా లేకపోలేదు.
ఇటీవల దర్శకుడు త్రివిక్రమ్.. తన హోమ్ బ్యానర్ అయిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నుంచి తప్పుకుంటున్నాడని వార్తలు రావడమే. కానీ, ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ నాగవంశీ.. గాడ్ ఆఫ్ వార్ ఆగలేదని తెలిసేలా గురూజీ, చినబాబు, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఈ ఒక్క ఫోటోతో పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిన తరువాత రోజునే తారక్.. అనిల్ రావిపూడితో సినిమాని ప్రకటించడం ఇండస్ట్రీలో మరికొన్ని అనుమానాలకు తావు ఇచ్చినట్లు అయ్యింది.
సరే.. ఎన్టీఆర్, ఈ రెండు సినిమాలని చేస్తున్నాడు అనుకున్నా.. మొదట ఏ చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడు అనేది పెద్ద మిస్టరీగా మారింది. డ్రాగన్ షూట్ ఫినిష్ చేశాక వెంటనే గురూజీ సెట్ లో అడుగుపెడతాడని ఇప్పటివరకు ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, ఈలోపే అనిల్ ప్రాజెక్ట్ రావడంతో.. మళ్లీ గాడ్ ఆఫ్ వార్ వెనక్కి పోయిందా అనే టాక్ నడుస్తోంది. ఒకవేళ త్రివిక్రమ్ సినిమా కాస్త ఆలస్యమైతే, ముందుగా అనిల్ రావిపూడి సినిమానే పట్టాలెక్కే అవకాశాలు కూడా లేకపోలేదని ఇండస్ట్రీ విశ్లేషకులు అంటున్నారు. ఇదే కనుక నిజమైతే గురూజీ.. ఎన్టీఆర్ కోసం ఇంకో ఏడాది ఆగక తప్పదని తెలుస్తోంది. డ్రాగన్ ని వచ్చే ఏడాది రిలీజ్ చేస్తే.. ఆ పై ఏడాది సంక్రాంతికి అనిల్ తో వస్తాడు తారక్. ఈ రెండు సినిమాలు అయ్యేవరకు గురూజీ ఆగుతాడా.. ? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. మరి ఎన్టీఆర్ ఈ రెండు సినిమాల్లో దేన్ని ముందు పట్టాలెక్కిస్తాడు అనేది చూడాలి.