Crazy Kalyanam: పెళ్ళి చుట్టూ సాగే కథతో 'క్రేజీ కళ్యాణం'

ABN , Publish Date - Jan 05 , 2026 | 06:29 PM

సీనియర్ నటుడు నరేష్, అనుపమా పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ కీలక పాత్రలు పోషించిన సినిమా 'క్రేజీ కళ్యాణం'

Crazy Kalyanam Movie

సీనియర్ నటుడు నరేష్ వీకే (Naresh VK), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), తరుణ్ భాస్కర్ (Tharun Bhascker), 'రాజు వెడ్స్ రాంబాయి' ఫేమ్ అఖిల్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'క్రేజీ కళ్యాణం'. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2 గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. బద్రప్ప గాజుల దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగే చిత్రమిదని, తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో 'క్రేజీ కళ్యాణం' సినిమా షూటింగ్ జరిపామని మేకర్స్ తెలిపారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మేకర్స్ వెల్లడించనున్నారు. 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో', 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రాలకు మ్యూజిక్ అందించిన సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

Updated Date - Jan 05 , 2026 | 06:29 PM