సత్య, యోగి బాబు కాంబోలో ఫుల్ ఎంటర్‌టైనర్.. కొత్త సినిమా ఘనంగా ప్రారంభం

ABN , Publish Date - May 13 , 2026 | 07:31 AM

హాస్య నటులు సత్య, యోగి బాబు ప్రధాన పాత్రల్లో పవన్‌ బాసంశెట్టి దర్శకత్వంలో కొత్త వినోదాత్మక చిత్రం ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైందని మేకర్స్ వెల్లడించారు.

Sathya

సహజమైన హాస్యం, స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటులు సత్య (Sathya), యోగి బాబు (YogiBabu) ప్రధాన పాత్రధారులుగా పవన్‌ బాసంశెట్టి (Pawan Basamsetti) దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం సోమవారం ప్రారంభమైంది. నాగార్జున రెడ్డితో కలిసి పవన్‌ బాసంశెట్టి నిర్మిస్తున్నారు.

Sathya YogiBabu

ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్‌ కిశోర్‌ తిరుమల (Kishore Tirumala) క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు మహేశ్‌బాబు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకులు యధువంశీ, సందీప్‌ రాజ్‌ మేకర్స్‌కి స్ర్కిప్ట్‌ అందించారు. సత్య, యోగి బాబులపై కీలక సన్నివేశాల చిత్రీకరణతో రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి డీఓపీ:బబ్లూ అజు, సంగీతం:పవన్‌ సీహెచ్‌.

Sathya YogiBabu

Updated Date - May 13 , 2026 | 07:31 AM