Praneetha Patnaik: కేరాఫ్ కంచరపాలెం బ్యూటీ.. బికినీ అవతార్.. దేవుడా పిచ్చెక్కించిందంతే

ABN , Publish Date - May 04 , 2026 | 04:49 PM

ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ గ్లామర్ ఉన్నంతవరకే ఎవరైనా కెరీర్ ని కొనసాగించగలరు. ముఖ్యంగా హీరోయిన్లు. ఒక సినిమాలో పద్దతిగా కనిపిస్తే.. వారికి అలాంటి పాత్రలే వస్తాయి.

Praneetha Patnaik

Praneetha Patnaik: ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ గ్లామర్ ఉన్నంతవరకే ఎవరైనా కెరీర్ ని కొనసాగించగలరు. ముఖ్యంగా హీరోయిన్లు. ఒక సినిమాలో పద్దతిగా కనిపిస్తే.. వారికి అలాంటి పాత్రలే వస్తాయి. బయట కూడా వారు అలానే ఉంటారు అనుకోవడం పొరపాటు. ప్రతి హీరోయిన్ పాత్రకు తగ్గట్లు మారుతుంది. రియల్ లైఫ్ లో తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నటి ప్రణీత పట్నాయక్ (Praneetha Patnaik) కూడా అదే రీతిలో కొనసాగుతోంది. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ప్రణీత కెరీర్ ని మొదలుపెట్టింది. భార్గవి పాత్రలో ఎంతో అమాయకంగా, పద్దతిగా, విలేజ్ గర్ల్ గా కనిపించింది. మొదటి సినిమాతోనే ఆమె అందరి ప్రశంసలు అందుకుంది.


ఇక సీతారామం సినిమా ప్రణీతకు మంచి గుర్తింపును తీసుకొచ్చిపెట్టింది. లెఫ్టినెంట్ రామ్ కి చెల్లెలిగా ఉత్తరాలు రాసే వేశ్య పాత్రలో ప్రణీత నటన అద్భుతమని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా తరువాత అమ్మడు ఈగల్, కుమారి శ్రీమతి, రిచిగాడి పెళ్ళి, నెట్ లాంటి సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో బిజీగా ఉన్న ప్రణీత.. సినిమాల్లో ఎంత పద్ధతిగా కనిపించినా రియల్ లైఫ్ లో మాత్రం చాలా మోడ్రన్ గా ఉంటుంది.


తాజాగా ప్రణీత వెకేషన్ ఫోటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోన్నాయి. ఫ్రెండ్స్ తో కలిసి గోవాలో ఛిల్ల్ అవుతోన్న ఈ చిన్నది.. బికినీలో ఉన్న ఫోటోలను షేర్ చేసి బెంబేలెత్తించింది. మునుపెన్నడూ లేని విధంగా టూ పీస్ బికినీలో అమ్మడి అందాల ఆరబోతకు ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎంత పద్దతిగా కనిపించే అమ్మాయి..సడెన్ గా బికినీ అవతార్ లో కనిపించిందేంటి అంటూ నోర్లు వెళ్ళబెడుతున్నారు.

Updated Date - May 04 , 2026 | 04:58 PM