విజయ్ దేవరకొండ ఇంటికి.. సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Mar 05 , 2026 | 09:25 PM

ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన కొత్త జంట విజయ్, రష్మికలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు.

Vijay Deverakonda, Rashmika

చిర‌కాల ప్రేమ ప‌క్షులు విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) , ర‌ష్మిక (rashmika) గ‌త నెల చివ‌ర‌లో వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విష‌యం తెలిసిందే. ఆపై విజ‌య్ సొంతూరులో వ్ర‌తం, స్థానికుల‌కు విందు వంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

అనంత‌రం బుధ‌వారం హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్ష‌న్ నిర్వ‌హించ‌గా టాలీవుడ్‌, బాలీవుడ్, రాజ‌కీయ ప్ర‌ముఖులు అనేక మంది హ‌జ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.

Vijay Deverakonda, Rashmika

అయితే.. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) న‌గ‌రంలో అందుబాటులో లేక‌పోవ‌డంతో ఈ వేడుక‌కు హ‌జ‌రు కాలేక పోయారు.

ఈ క్ర‌మంలో గురువారం ఉద‌యం తిరిగి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన సీఎం సాయంత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక దంప‌తుల‌ను వారి ఇంటికి స్వ‌యంగా వెళ్లి పుష్ప‌గుచ్చం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బాగా వైర‌ల్ అవుతున్నాయి.

Updated Date - Mar 06 , 2026 | 02:37 PM