నానిని.. మరోస్థాయిలో చూపించాలనే 'ఆయా షేర్'

ABN , Publish Date - Mar 04 , 2026 | 06:49 AM

నాని గారు మంచి స్టైలిష్‌ డ్యాన్సర్‌. ఆయనను మరో స్థాయిలో చూపించాలనే ఆలోచనతోనే 'ఆయా షేర్' పాటకు కొరియోగ్రఫీ మొదలుపెట్టా అని సుధన్‌ మాస్టర్ అన్నారు.

Choreographer Sudhan

‘ది ప్యారడైజ్‌’ (The Paradise) చిత్రంలో ఆయా షేర్ ( Aya Sher Song) పాట ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా ఉండాలని డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) చెప్పారు. ఎందుకంటే.. నాని (Nani) ఎప్పుడు చేయ‌ని సరికొత్త శక్తిమంతమైన పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ సినిమాకు ఇంట్రో సాంగ్‌ చాలా ముఖ్యం. నానిగారు మంచి స్టైలిష్‌ డ్యాన్సర్‌. ఆయనను మరో స్థాయిలో చూపించాలనే ఆలోచనతోనే ఈ పాటకు కొరియోగ్రఫీ మొదలుపెట్టాను’ అని అన్నారు సుధన్‌ మాస్టర్ (Sudhan).

నాని కథానాయకుడిగా శ్రీకాంత్‌ ఓదెల రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. ఎల్‌ఎల్‌వీ సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తుండ‌గా క‌యాదు లోహ‌ర్ క‌థానాయిక‌.

మోహ‌న్ బాబు, సంపూర్ణేశ్ బాబు కీల‌క పాత్ర‌లు చేస్తున్నారు. ఆగస్టు 21న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘ఆయా షేర్‌’ పాట కొరియోగ్రాఫర్‌ సుధన్‌ మాస్టర్‌ మీడియాతో మాట్లాడారు.

Updated Date - Mar 04 , 2026 | 06:49 AM