కొరియోగ్రాఫర్ పండు ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందంటే..

ABN , Publish Date - Jul 11 , 2026 | 07:00 PM

ప్రముఖ డ్యాన్సర్ పండు మాస్టర్‌ (Pandu) ఈ మధ్యనే రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. విశాఖపట్నం జిల్లా తగరపువలసలో జరిగిన అమ్మవారి ఉత్సవాల ఈవెంట్‌లో పాల్గొని కారులో తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Pandu Master

ప్రముఖ డ్యాన్సర్ పండు మాస్టర్‌ (Pandu) ఈ మధ్యనే రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. విశాఖపట్నం జిల్లా తగరపువలసలో జరిగిన అమ్మవారి ఉత్సవాల ఈవెంట్‌లో పాల్గొని కారులో తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆనందపురం సమీపంలో కారు ఆపి రోడ్డు పక్కన నిలబడిన పండు మాస్టర్ వెనక నుంచి వేగంగా వచ్చిన ఒక కోళ్ల వ్యాన్ ఆయనను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో పండు మాస్టర్ రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందించారు.


ఇక ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పండును శేఖర్ మాస్టర్ స్వయంగా కలిసి పరామర్శించాడు. పండు మాస్టర్ నివాసానికి వెళ్లిన ఆయన, ఆరోగ్య పరిస్థితిని, వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నాడు. పండు మాస్టర్ మళ్లీ పూర్తి ఆరోగ్యంతో సినీ రంగంలోకి అడుగుపెట్టి, తనదైన శైలిలో అదిరిపోయే స్టెప్పులతో ప్రేక్షకులను అలరించాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం పండు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది.


ఇక వీరిద్దరి కలయికకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. శేఖర్ మాస్టర్ చూపించిన ఈ మానవత్వం, తోటి డ్యాన్స్ మాస్టర్‌పై ఉన్న గౌరవం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఢీ షోలో వీరిద్దరి మధ్య జరిగే కామెడీ సీన్స్ అద్బుతంగా ఉంటాయి. ఇక మొదటి నుంచి పండుకు శేఖర్ మాస్టర్ తోడుగా ఉంటూ వస్తున్నాడు. ఇప్పుడు కూడా పండు ఇంటికి ఎవరు వెళ్లలేదు అని తెలుస్తోంది. ఇప్పుడు శేఖర్ మాస్టర్ వెళ్ళడంతో ఆయనపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - Jul 11 , 2026 | 07:36 PM