లెనిన్ క్లైమాక్స్.. బాలయ్య సినిమాకు కాపీ అని మీకు తెలుసా
ABN , Publish Date - Jul 11 , 2026 | 07:00 PM
అఖిల్ అక్కినేని (Akhil Akkineni), భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) జంటగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లెనిన్ (Lenin). అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ జులై 10 న రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అఖిల్ అక్కినేని (Akhil Akkineni), భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) జంటగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లెనిన్ (Lenin). అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ జులై 10 న రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా లెనిన్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆ ట్విస్ట్ లకు ప్రేక్షకుడి మతి పోతోంది. అయితే ఈ సినిమా చూశాక క్లైమాక్స్‌లో వచ్చే ఒక మేజర్ ట్విస్ట్.. 1999లో నందమూరి బాలకృష్ణ నటించిన క్రిష్ణబాబు సినిమాలోని ఒక ఐకానిక్ సీన్‌కు జిరాక్స్ కాపీ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు ఆధారాలతో సహా వీడియోలను వైరల్ చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ, మీనా, రాశి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం క్రిష్ణబాబు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా 1999లో రిలీజ్ అయ్యి ఒక మోస్తరుగా విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో ఒక ఐకానిక్ సీన్ నే లెనిన్ టీమ్ కాపీ చేశారని పాత తరం సినిమా లవర్స్ చెప్పుకొస్తున్నారు. ఈ చిత్రంలో విలన్ పగతో హీరో కళ్లల్లో కారం కొట్టి, కంటిచూపు కనిపించకుండా చేస్తాడు. అదే సమయంలో హీరోయిన్ మీనా నోట్లో గుడ్డలు కుక్కి, ఆమె అరవకుండా చేసి.. హీరో బాలకృష్ణ చేతికే కత్తి ఇచ్చి కుట్రతో హీరోయిన్‌ను చంపేలా చేస్తాడు.
ఇక లెనిన్ ప్రీ క్లైమాక్స్‌లో కూడా ఇదే సీన్ ని వాడటం ఇప్పుడు టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. విలన్ హీరో కళ్లల్లో ఒక కెమికల్ కొట్టడం, హీరోయిన్ నోట్లో గుడ్డలు చుట్టడం, చివరకు లెనిన్ చేత్తోనే భారతి ప్రాణాలు కోల్పోయేలా చేయడం.. అచ్చు గుద్దినట్లు కృష్ణబాబు సీన్‌ను దించేసినట్లు ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు దీన్ని స్ట్రైట్ కాపీ అని విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం అప్పట్లో బాలయ్య చేసిన ఆ పవర్‌ఫుల్ ట్రాజిక్ ఎమోషన్‌ను దర్శకుడు నందు ఇప్పుడు అఖిల్‌తో నేటి తరం ఆడియన్స్‌కు తగ్గట్లుగా రీక్రియేట్ చేసి సక్సెస్ అయ్యాడంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా 1999 నాటి బాలయ్య సినిమా సీన్ ఇప్పుడు అఖిల్ లెనిన్ మూవీతో మళ్లీ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.