మృణాల్‌ ఠాకూర్‌: సరస్వతిగా ఆ రెండు చేసే అవకాశం దక్కింది

ABN , Publish Date - Apr 05 , 2026 | 09:01 PM

‘ఒక యాక్టర్‌కు సవాల్‌ విసిరే పాత్ర చేయడం ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది. ఇందులో సరస్వతి క్యారెక్టర్‌ చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది.


‘ఒక యాక్టర్‌కు సవాల్‌ విసిరే పాత్ర చేయడం ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది. ఇందులో సరస్వతి క్యారెక్టర్‌ చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది. నాకు డిఫరెంట్‌ రోల్‌ ఇది. ఈ పాత్ర చేయడం చాలా సంతోషానిచ్చింది. కథ విన్నప్పుడు సరస్వతి, హరి ఎందుకు డెకాయిట్స్‌ మారారనేది ఆసక్తికరంగా అనిపించింది. అది బిగ్‌ స్క్రీన్ మీద చూస్తేనే కిక్‌ ఉంటుంది’ అని మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) అన్నారు.
అడివి శేష్‌ సరసన ఆమె నటించిన చిత్రం ‘డెకాయిట్‌’ (Dacoit). శానిల్‌ దర్శకుడు. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా మృణాల్‌ విలేకర్లతో మాట్లాడారు.

‘డెకాయిట్‌’ చిత్రంతో సరస్వతిగా కనిపిస్తా. ఒక యాక్టర్‌కు ఛాలెంజ్‌ ఉన్న క్యారెక్టర్‌ చేయడం ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది. సరస్వతి క్యారెక్టర్‌ చేయడం నాకు చాలా సంతోషానిచ్చింది. నా కెరీర్‌ చాలా డిఫరెంట్‌ రోల్‌ ఇది. ఇప్పటి వరకూ చేయని జానర్‌ ఇది. ఇందులో కొన్ని స్టంట్స్‌ కూడా చేశాను. చేజింగ్‌ సన్నివేశాలు, డ్రైవింగ్‌ సీన్స్‌ చాలా ఎంజాయ్‌ చేస్తూ చేశాను. నాకు డ్రైవింగ్‌ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో కార్‌ డ్రైవ్‌ చేసిన మొదటి అమ్మాయి నేనే. ఈ సినిమాలో అలాంటి యాక్షన్‌ చేేస అవకాశం దొరికింది. ప్రయోగాలు చేయడం, సర్‌ప్రైజ్‌ ఇవ్వడం కూడా నాకు ఇష్టం. అలాంటి అవకాశం ఇచ్చిన సినిమా ఇది. అలాగే నాకు కొత్త ఎమోషన్స్‌ ఉన్న సినిమాలు చేయాలనిపిస్తుంది. ఇప్పటివరకు చేయని క్యారెక్టర్లు చేయాలనే తపన ఉంటుంది.  

Mrunal.jpg

శేష్‌ కోసం చూడాలి..  

శేష్‌ స్వయంకృషితో ఎదిగిన స్టార్‌. సెల్ఫ్‌మేడ్‌ స్టార్‌తో పనిచేయడం పనిచేయడం గొప్ప అనుభవం. ఆయన సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. రైటింగ్‌, డైరెక్షన్‌.. అన్నిట్లోనూ ప్రత్యేక శ్రద్థ తీసుకుంటారు. చాలా హంబుల్‌ పర్సన్‌. ఈ సినిమాకు శేష్‌ క్యారెక్టర్‌ హైలైట్‌. ఆయన కోసమే జనాలు సినిమా చూడాలనుకుంటున్నారు.  హరి పాత్రకు అంత అద్భుతంగా నటించారు. ఆయనకు కూడా కొత్త క్యారెక్టరే ఇది. ఆయన బెస్ట్‌ ఫిల్మ్స్‌లో ఇది కూడా ఉంటుంది. అనురాగ్‌ కశ్యప్‌ గొప్ప దర్శకుడు. యాక్టర్‌గా కూడా వెర్సటైల్‌. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్‌ ప్రత్యేకంగా ఉంటుంది. మేమిద్దరం హిందీ నుంచి వచ్చాం. కలిసి తెలుగు డైలాగ్స్‌ నేర్చుకోవడం మంచి అనుభూతినిచ్చాయి.

హాలీవుడ్‌ స్టైల్‌లో..

శానిల్‌ ఫాంటాస్టిక్‌ డైరెక్టర్‌. ఈ సినిమాను విజువల్‌గా అద్భుతంగా తీర్చిదిద్దారు. డైరెక్టర్‌, ఎడిటర్‌, కెమెరామెన్‌ ఈ ముగ్గురి టీమ్‌ వర్క్‌ చాలా గొప్పగా ఉంది. విజువల్స్‌ హాలీవుడ్‌ స్టైల్‌లో ఉంటాయి. అన్ని విభాగాల వారు చక్కగా పని చేశారు. మ్యూజిక్‌ కూడా నెక్స్ట్‌ లెవెల్‌లో ఉంటుంది. ఇందులో ‘కన్నేపెట్టరో’ సాంగ్‌ అంటే నాకు ఇష్టం. నిర్మాత సుప్రియ కూడా టీమ్‌ అందరినీ బాగా చూసుకున్నారు. అన్నపూర్ణ సంస్థ పని చేయడం ఓ వరం అనుకోవాలి.

 

Updated Date - Apr 05 , 2026 | 09:03 PM