Bhagyashri Borse: అప్పుడు ఇబ్బంది అనిపించింది.. ఇప్పుడు లైట్

ABN , Publish Date - Jul 05 , 2026 | 09:13 AM

ఉత్తరాదికి చెందిన భాగ్యశ్రీ బొర్సే... మోడలింగ్‌ నుంచి వెండి తెరకు పరిచయమైంది. ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ చిత్రాలతో కుర్రకారు హృదయాలను దోచుకుంది. అదే సమయంలో... కేవలం గ్లామర్‌ డాల్‌గానే మిగిలిపోకుండా, పాత్రకు ప్రాణం పోయగలనని ‘కాంత’లో నిరూపించింది.

ఉత్తరాదికి చెందిన భాగ్యశ్రీ బొర్సే(Bhagyashri Borse)... మోడలింగ్‌ నుంచి వెండి తెరకు పరిచయమైంది. ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ చిత్రాలతో కుర్రకారు హృదయాలను దోచుకుంది. అదే సమయంలో... కేవలం గ్లామర్‌ డాల్‌గానే మిగిలిపోకుండా, పాత్రకు ప్రాణం పోయగలనని ‘కాంత’లో నిరూపించింది. ‘లెనిన్‌’ (Lenin) విడుదల సందర్భంగా ఆమె గురించిన తాజా ముచ్చట్లు...

ఏది మంచిదో అదే ఇస్తాడు...

కాలక్రమంలో దేవుడిపై నమ్మకం పెరిగింది. దేవుడు మనకు ఏది మంచిదో అదే ఇస్తాడు అనే భావనను అలవాటు చేసుకున్నా. మనాలీ ట్రిప్‌లో ఉన్నప్పుడు ‘జియా’ అనే కుక్కపిల్లను దత్తత తీసుకోవడం నా జీవితంలో పెద్ద మార్పు తెచ్చింది. ‘జియా’ వచ్చాక ఇంట్లో సంతోషం, ప్రశాంతత నిండాయేమోనని అనిపిస్తోంది.


2.jpg

కష్టానికి తగ్గ ఫలితం..

పని చేసే రంగం ఏదైనా మన కష్టానికి తగిన ఫలితం తప్పక ఉంటుంది. ‘కాంత’లో నేను పడ్డ కష్టాన్ని చూసి సెట్‌లో అందరూ ఆశ్చర్యపోయారు. అంతలా ఎప్పుడూ కష్టపడటం చూడలేదన్నారు. అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ, సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల ఆదరణ, విమర్శకుల ప్రశంసలు చూస్తే... కష్టానికి తగ్గ ఫలితం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకం మరింత బలపడింది.

ఎగతాళి చేసేవారు...

కొన్నిసార్లు చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవం ఎల్లకాలం వెంటాడుతూనే ఉంటుంది. చిన్నప్పుడు నేను ఆరేళ్లపాటు నైజీరియాలో పెరిగాను. ఇండియాకు వచ్చిన కొత్తలో ఇంగ్లీష్‌ మాట్లాడటం సరిగ్గా వచ్చేది కాదు. స్కూల్లో తోటి విద్యార్థులు ఎగతాళి చేసేవారు. ఆ సమయంలో తీవ్ర ఆందోళనకు గురయ్యా. ఆ తర్వాత ప్రాక్టీస్‌ చేసి పబ్లిక్‌ స్పీకింగ్‌పై పట్టు సాధించా.

Bahgya.webp

ట్రోలింగ్‌తో ఇబ్బంది

ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చినదాన్ని కావడంతో కొత్తలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమా ప్రమోషన్స్‌ సమయంలో హీరోకు, నాకు మధ్య ఉన్న ఏజ్‌ గ్యాప్‌ను ఎత్తిచూపుతూ... సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ చేశారు. కెరీర్‌ ఆరంభంలోనే ఇలాంటి నెగిటివిటీని ఫేస్‌ చేయడం చాలా ఇబ్బంది అనిపించింది. అయితే ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా లైట్‌ తీసుకున్నా.


అలాంటి పాత్రల కోసం...

షారుక్‌ఖాన్‌ నా ఫస్ట్‌ క్రష్‌. ఆయనతో కలసి నటించాలనేది నా జీవిత కాల కల. ఇక సినిమాల విషయానికొస్తే బలమైన మహిళా పాత్రలే చేయాలనుకుంటున్నా. లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలంటే చాలా ఇష్టం. అనుష్క శెట్టి నటించిన ‘అరుంధతి’ లాంటి శక్తిమంతమైన, నటనకు ఆస్కారమున్న పాత్రల కోసం ఎదురుచూస్తున్నా..

ప్రేమపై నమ్మకం ఉంది...

నేను కచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటా. నాకు ప్రేమ మీద అపారమైన నమ్మకం ఉంది. నన్ను నన్నుగా అర్థం చేసుకునే వ్యక్తినే ప్రేమించి పెళ్లి చేసుకుంటా. ప్రస్తుతం ఎవరితో ప్రేమలో లేను. పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి పెట్టా.

ఇవి కూడా చదవండి:

సుకుమార్- దేవిశ్రీ ప్రసాద్ కాంబోకి బ్రేక్? కారణమిదేనా?!

ఇదే ఈ బాబాయ్- అబ్బాయ్ డెబ్యూ స్పెషాలిటీ!

అఖిల్ కోసం రంగంలోకి ఎన్టీఆర్? ఇక ఊహించుకోండి!

Updated Date - Jul 05 , 2026 | 10:19 AM